వైసీపీ.. ప్రాజెక్టుల పరిశీలన

 

కడప జిల్లాలోని లింగాల మండలంలోని సిబిఆర్ ప్రాజెక్టు ను వైఎస్ఆర్ పార్టీ నాయకుల బృందం పర్యటించింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరియు వైయస్ఆర్ జిల్లా పార్లమెంటరి ఇంచార్జ్ సురేష్ బాబు గారు రైతులతో కలసి సిబిఆర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని పరిశీలించారు ఈ రోజు పులివెందుల నియోజకవర్గ ప్రజలకు తాగు సాగునీరు అందుబాటులోకి వచ్చాయంటే దివంగతనేత వైఎస్ రాజశేఖరెడ్డి గారి చలవే అన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలపై దివంగతనేత వైఎస్ఆర్ కు ఎనలేని అభిమానం ఆ అభిమానం కారణంగానే పైడిపాళెం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందన్నారు. గండికోట నుంచి సిబిఆర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో వందల కోట్లు ఖర్చుపెట్టి సిబిఆర్ కు నీళ్లు తీసుకురావడం జరిగిందన్నారు పైడిపాళెం ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని దృఢ సంకల్పంతో ఆ మహానేత కృషి చేశారన్నారు .ఇవాళ ఇంటిని పూర్తిగా నిర్మించిన తరువాత రంగులు వేయడానికి వచ్చి ఇల్లు మేమే అంతా ఇంటిని పూర్తి చేశాం అని అన్నట్లుంది టిడిపి నాయకుల వ్యవహార శైలి అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎద్దేవచేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే దివంగతనేత వైఎస్ఆర్ ఆశయంగా ఉండేదని ఆశయానికి అనుగుణంగానే ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందన్నారు .ఇవాళ టిడిపి నాయకులు ఏమీ చేయకపోయినా మేమే చేశామని గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాలను రైతులకు అర్థమే విధంగా ఎల్ఈడీలు స్క్రీన్ల ద్వారా వివరించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *