వైసీపీ ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది;కొనకళ్ల నారాయణ

73

పాలనలో అన్ని విధాలుగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం.. తమ డొల్లతనం బయటపడుతుండటంతో దిగజారుడు విమర్శలకు దిగుతోంది. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే ముఖ్యమంత్రి ఏపీకి ఉండటం ప్రజల దురదృష్టం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారు. బెయిల్‌ కోసం సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న చరిత్ర జగన్‌ది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేని విధంగా 11సీబీఐ ఛార్జిషీట్లు జగన్‌పై నమోదుఅయ్యాయి. త్వరలోనే ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయం. ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే అభ్యర్థనతో వైసీపీకి అధికారం అప్పగిస్తే.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. రద్దులు, రివర్స్‌ పాలనతో అంతర్జాతీయంగా రాష్ట్రం అపఖ్యాతి పాలయింది. అమరావతి నిర్మాణం, ఏపీ జీవనాడి అయిన పోలవం ప్రాజెక్టును నిలిపివేశారు. జగన్‌ అనుభవలేమి, జే ట్యాక్స్‌లతో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. ఇసుక, మద్యం పేరుతో వేలాది కోట్ల అవినీతికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే.. జగన్‌ పాలనలో తిరోగమనంలోకి వెళ్తోంది. చంద్రబాబు గారి అభివృద్ధిని ప్రజల్లో నుంచి తుడిచివేయడం అసాధ్యం. దిగజారుడు, వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here