వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధులకు కూడా భద్రత లేదు

84

రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ ప్లాన్‌ చేస్తోందని నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై వైసీపీ నేతల దౌర్జన్యం రుజువు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వందలకు పైగా దాడులు జరిగాయి. ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా శాసనసభ సభ్యుడిపైనే దాడికి యత్నించడం బాధాకరం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఈ దాడులు కనిపించడం లేదా.? ఇంత జరుగుతున్నా జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు.? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కూడా రక్షణ లేకపోవడం తొలిసారిగా చూస్తున్నాం. వైసీపీ మూకలు ఇప్పటి వరకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు మరింత బరితెగించి ఎమ్మెల్యేపై దాడి చేయాలనుకోవడం, అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం గర్హణీయం. మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీని తగ్గించడం ద్వారా ఆయన భద్రతను గాలికొదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా శాసనసభ్యులపై దాడులు జరుగుతున్నా చేష్టలుడిగి చూస్తుండడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఇలాంటి దాడులను సహించదు. వైసీపీ నేతల దాడులను ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి, డీజీపీ ఇప్పటికైనా ఇలాంటి దాడుల విషయంలో చొరవ తీసుకుని నిలువరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here