వైసీపీ నుంచి ఊళ్లకు ఊళ్లు టీడీపీలోకి..!

కర్నూలు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌కి ఆఖరిలో ఆళ్లగడ్డ అప్ అండ్‌ డవున్‌ అదిరిపోయే షాక్‌ ఇచ్చింది. మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో వైసీపీ శాఖలకు శాఖలు తెలుగుదేశంలోకి తరలివచ్చేసాయి. ఆళ్ళగడ్డకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా నేతలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణ మూర్తి, మంత్రులు భూమా అఖిలప్రియ, ఆధ్వర్యంలో వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి కెసీ కెనాల్ డి.సి. చైర్మన్ సిద్ధం రెడ్డి ఝాఫర్ రెడ్డ్, అంబటి శ్రీవిద్యతోపాటు మరో పది మంది వార్డు కౌన్సిలర్లు ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చింతకుంట ఎంపీటీసీ జె.రామకృష్ణ, మాజీ సర్పంచి టి. మెహబూబ్ భాషా, విన్నకోట మండలం భాగ్యనగరం గ్రామం నుంచి కె.సురేంద్ర, వార్డు సభ్యులు తలశీస్వరరెడ్డి హర్షవర్ధన్, విద్యా కమిటీ చైర్మన్ పద్మావతి, రామచంద్రాయపురం గ్రామం నుంచి కె. శ్రీనివాసులు, కె. లక్ష్మీనారాయణ, వార్డు సభ్యుడు బత్తిన వెంకటేశ్వర్లు లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు…దొండపాడు మండలం భాగ్యనగరం, రామచంద్రాపురం నుంచి రెండు వందల మందిపైగా వైకాపా కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు…వీరంతా ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి, మంత్రి అఖిల ప్రియ, శాసససభ్యులు ఎస్వీ మోహనరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిల ఆధ్వర్యంలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *