వైసీపీ ఎంపీ పేరుతో దందాలు..స్కార్పియో వాహనంలో దర్జాగా!

33

వైఎస్సార్‌సీపీ ఎంపీ పేరుతో మంగళగిరిలో దందాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో సెటిల్‌మెంట్లకు వెళ్లిన యువకులు. విషయం తెలియడంతో యువకుల్ని మందలించిన ఎంపీ నందిగం సురేష్.

వైఎస్సార్‌సీపీ ఎంపీ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలో యువకులు దందా చేస్తున్నారు. కొద్దిరోజులుగా నందిగం సురేష్ పేరుతో ఎంపీ స్టిక్కర్‌ వేసిన స్కార్పియోలో తిరుగుతున్నారు. ఎంపీ పేరుతో 15 రోజులుగా దందాలు చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో భూ వివాదం చర్చించేందుకు ఎంపీ సురేశ్ పేరును యువకులు వినియోగించుకున్నారట.

యువకులు దందాలు చేస్తున్న విషయం తెలియడంతో ఎంపీ నందిగం సురేష్ రంగంలోకి దిగారు. ఆ యువకుల్ని పిలిచి మందలించారు. తన పేరు చెప్పుకుని ఇలాంటి పనులు చేయడం ఏంటని హెచ్చరించారు. తన పేరుతో ఉన్న స్టిక్కర్‌ను తొలిగించారు. గత నెల రోజులుగా తాము చేసిన దందాలకు ఎంపీ సురేష్ గారికి ఎటువంటి సంబంధం లేదని మంగళగిరి స్టేషన్లో యువకులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here