వైసీపీకి అనుబంధంగా భాజ‌పా ప‌నిచేస్తుంది – బుద్ధా వెంకన్న

14

భాజ‌పా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుడంకాయలు అని, వైసీపీకి బీజేపీ అనుబంధంగా పని చేస్తుంద‌ని ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న అన్నారు. గురువారం ఉద‌యం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయ‌న మాట్లాడుతూ మోడీ డైరెక్షన్‌లో జగన్… జగన్ డైరెక్షన్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు పని చేస్తున్నార‌ని ఆరోపించారు. అసెంబ్లీ భ‌వ‌నంలో లీకులు నుంచి వ‌ర్షం నీరు కారుతుంద‌ని గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకుని వ‌చ్చిన భాజ‌పా నేత‌ల‌నుద్దేశించి బుద్దా వెంక‌న్న మాట్లాడుతూ ఎక్కడో ఒకటి, రెండు చోట్ల నీరు కారితే దాన్ని పూడ్చొచ్చు. అంతేగాని రాద్దాంతం చేయడం తగద‌న్నారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల జేబులకు మోదీ చిల్లులు పెట్టార‌న్నారు. ఏటీఎంల వద్దకు వెళితే బీజేపీ నేతలను జనం చెప్పులతో కొడతార‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పగటివేషాలు మానుకోవాల‌న్నారు. చంద్రబాబు నాయుడు పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టిన తర్వాత మోదీ గ్రాఫ్ అమాంతం పడిపోయింద‌న్నారు. 2019 ఎన్నికల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నార‌ని, మోదీని గద్దె దింపాలన్న కసి ప్రజల్లో ఉంద‌న్నారు. ఏపీతో పాటు దేశంలోనూ చంద్రబాబు ఇమేజ్ పెరుగుతోంద‌న్నారు. ఇది మోడీకి అర్థమైంద‌ని.. అందుకే జగన్‌ను అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజల పక్షాన పోరాడటం బీజేపీ నాయకులు నేర్చుకోవాలి. రోజుకు 18గంటలు పని చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు సరికాద‌న్నారు. 11 ఈడీ కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్‌ను మోడీ సపోర్ట్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. జగన్‌ను ముందు జైలులో వేయాలి. దొంగను రోడ్లపైకి వదిలేస్తే ప్రజలు క్షమించర‌ని, . చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌తో జగన్‌కు, మోదీకి కిందా, పైనా తడిసిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. వరుణుడి దయవల్ల రాష్ట్రంలో రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయ‌న్నారు. దీన్ని చూసి మోడీ, జగన్ ఓర్వలేకపోతున్నార‌ని పేర్కొన్నారు. సినిమాలో హీరో చంద్రబాబు అయితే, విలన్ జగన్, కమెడీయన్లలా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నార‌ని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here