వైసిపి,బిజెపిలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి;మాజీ మంత్రి ఆదాల

90

రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసిన బిజెపి ని దానికి వత్తాసు పలుకుతున్న వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం గాంధీబొమ్మ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో అవినాష్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఒక రోజు నిరాహారదీక్షకు ఆయన మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా తెలుగు యువత నేతలు దీక్ష చేయడం సంతోషమన్నారు మన బాధలు ప్రజలకు తెలియజేయడం అవసరమని ఇది ఒక మంచి అవకాశమని చెప్పారు విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే అన్యాయం చేసిందని బాధపడ్డామన్నారు ఇచ్చిన హామీలను బిజెపి అమలు చేస్తుందని నమ్మా మని తెలిపారు లోక్సభలో వెంకయ్య అరుణ్ జైట్లీలు పోరాడిన తీరు చూసి వారు మన రాష్ట్రం కోసం పోరాడుతున్నారని జతకట్ట మ న్నారు ఎన్నికల సమయంలో మోడీ నెల్లూరుకు వచ్చి అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పారన్నారు అయితే ప్రత్యేక హోదా రాలేదు దుగరాజపట్నం పోర్టు ఇవ్వలేదు దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింద ని అన్నారు. అనేక పరిశ్రమల రాక ఆగిపోయింది ఇంత జరుగుతున్నా వైసీపీ జగన్ బీజేపీని ఒక్క మాట అనడం లేదు విమర్శించడం లేదని తెలిపారు మనకు వ్యతిరేకులైన టిఆర్ఎస్తో జత కట్టారని విమర్శించారు అందువల్ల వైసీపీని ని బీజేపీ ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ మనకు న్యాయం చేయాల్సింది పోయి సి బి ఐ ,ఈ డి లతో దాడులు చేయిస్తూ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని విమర్శించారు ఈ వైఖరి చూసి చంద్రబాబు తిరగబడ్డార ని తెలిపారు దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం చంద్రబాబును మద్దతివ్వాల్సిన అవసరముందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి సీనియర్ నేత హరిబాబు యాదవ్ ఖాజవలి కార్పొరేటర్లు రాజేష్ సత్య నాగేశ్వరరావు సుకుమార్ నరసింహారావు పాముల హరి జీవన్ ప్రసాద్ పాల్గొన్నారు ఒక రోజు నిరాహార దీక్షలో అవినాష్ గంగాధర్ పాశం శ్రీనివాసులు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here