వైయస్ జయంతి రోజైన జగన్ నిజాలు మాట్లాడాలి;మంత్రి దేవినేని ఉమా

39

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి పిచ్చి పట్టిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. ఆదివారం నాడు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ బిజెపి డైరెక్షన్ లో వైసీపీ జనసేన నడుస్తున్నాయని జగన్ చెప్పే అబద్ధాలు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ప్రతి శుక్రవారం జగన్ కు బోన్ వారమని, సీఎం అవుతాననే భ్రమలో జగన్ పిచ్చి పట్టి తిరుగుతున్నాడని, వైఎస్ జయంతి రోజు అయిన జగన్ నిజాలు మాట్లాడాలని హితవు పలికారు.తెలుగుదేశం పార్టీ మినహాయించి అన్ని పార్టీలు కూడా బిజెపి డైరెక్షన్ లో నడుస్తున్నాయని మంత్రి ఉమా తెలిపారు.అనంతరం మంత్రి జిల్లా నేతలతో సమావేశమై ఈ నెల మూడో వారంలో పేరూర్ డ్యామ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించారు. 2019 మార్చి నాటికి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ ఈనెల 11వ తేదీన అనంతలో ధర్మ పోరాట దీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here