వైకాపా ఎమ్మెల్యేలకు జీతాలెందుకు: చంద్రబాబు

17

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైకాపా ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.అమరావతిలో ఏర్పాటు చేసిన తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలలో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… వైకాపా పోరాడలేక పారిపోయిన పార్టీ, అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు.బాధ్యత మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు.. జీతాలు తీసుకోవడం మరువలేదని విమర్శించారు.‘‘రాజధానికి ఇప్పుడే ఒక రూపు వస్తోంది… 15 ఏళ్లలోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.అమరావతి బాండ్ల జారీకి గంటన్నర వ్యవధిలో రూ.2వేల కోట్లు వచ్చాయి. ప్రజలకు మనపై ఉన్న నమ్మకానికి అది నిదర్శనం. కేంద్రం ఏపీకి నిధులివ్వకపోగా..పీడీ అకౌంట్లపై విమర్శలు చేస్తోంది.. కేంద్రం విమర్శలకు గట్టిగా సమాధానం ఇవ్వాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం. తెలంగాణ.. కేంద్రంతో సఖ్యతగా ఉంటే అన్నీఆమోదిస్తున్నారు. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here