వైకాపా,టీడీపీ పార్టీలపై రాహుల్‌ ఫైర్

Rahul Gandhiకాంగ్రెస్ యువనేత రాహూల్ గాంధీ అనంతపురంజిల్లాలో పాదయాత్ర చేశారు. ఓబులదేవచెరువు నుంచి కొండకమర్ల వరకు 10 కి.మీ ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కొండకమర్ల సభలో రాహూల్ గాంధీ ప్రసంగించారు. అనంతపురంజిల్లాలో వలసలను సోనియా చూశారని, వలసలను నివారించేందుకే ఉపాధి హామీని ప్రారంభించామని..ఉపాధి హామీతో పేదలకు మేలు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆకలి చావుల నివారణకు ఆహార భద్రత చట్టం తెచ్చామని రాహూల్ గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చడంలేదని, ఆయన ఏడాది పాలనలో కేవలం మాటలకే పరిమితమయ్యారని రాహూల్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం, వైకాపా ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం సాధనకోసం ఎక్కడైనా పోరాటానికి సిద్ధమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఏం చేస్తుందో అర్థం కావట్లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పోరటం వల్లే భూసేకరణ బిల్లుపై కేంద్ర పునరాలోచన చేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *