వైఎస్ భార‌తి కేసుపై జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

42

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌న భార్య భార‌తిని చేర్చుతూ ఈడీ, సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. భార‌తీ సిమెంట్స్ కేసులో భార‌తిని నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డంపై ఏపీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ఒక‌వైపు టీడీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. మ‌రోవైపు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంనేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. భార‌తి చార్జిషీట్ వ్య‌వ‌హారంపై శుక్ర‌వారం సాయంత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుద‌ల చేసిన బ‌హిరంగ లేఖ వివాదాస్ప‌దంగా మారింది. దానిపై స్పందించిన టీడీపీ,ఈడీ చార్జిషీట్ దాఖ‌లు చేస్తే.. దానిని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు , జ‌గ‌న్ అంట‌గ‌ట్ట‌డం ఏంట‌ని  ప్ర‌శ్నిస్తుంది.

.
ఈ క్ర‌మంలో తాజాగా భార‌తి కేసుపై మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్పందించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న రాజ‌కీయాల్లోకి అర‌గ్రేటం చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీలోని అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఆయ‌న‌, ఏ పార్టీలోకి అనేది మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అన్ని జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న,భార‌తి కేసుపై స్పందించారు.విశాఖపట్నం జిల్లా చోడవరంలో ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా?’ అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా భార‌తి కేసుపై జేడీని అక్క‌డ ఉన్న మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా ,ఆయ‌న అనూహ్య వ్యాఖ్య‌లు చేశారు. జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు గురించి నాకేం తెలియదు అంటూ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ్యాఖ్యానించ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here