వైఎస్ జ‌గ‌న్ ఇంటికి మంత్రి అఖిల‌ప్రియ‌

28

రాజ‌కీయాలు వేరు…వ్య‌క్తిగ‌త జీవితం వేరు. రాజ‌కీయంగా నేతలు ఒక‌రిపై ఒక‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా.. ప‌ర్స‌న‌ల్‌గా అంద‌రూ బాగానే ఉంటారు. రాజ‌కీయంగా పార్టీలు వేరైనా త‌మ ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు ఆహ్వానిస్తారు. రాజ‌కీయాల‌కు, పార్టీల‌కు ఆతీతంగా త‌మ ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు రాజ‌కీయ నేత‌లు అంద‌రినీ పిలుస్తుంటారు. ఇప్పుడు ఏపీ ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి అఖిల ప్రియ కూడా అదే చేయ‌బోతున్నారు.

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భూమా ఫ్యామిలీకి మ‌ధ్య ఉన్న బంధుత్వం గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేన‌మామ అయిన కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో అఖిల ప్రియ‌కు మొద‌ట పెళ్లి అయింది. కానీ వారిద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో కొన్ని రోజుల‌కే ఇద్ద‌రు విడిపోయారు. అయితే అఖిల‌ప్రియ‌ మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు భార్గవ్ ను రెండో వివాహాం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వారిద్ద‌రి నిశ్చితార్ధం కూడా పూర్తైంది. భార్గవ్ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు కూడా కావడం మ‌రో విశేషం.

గ‌త కొంత‌కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్ద‌రు ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఈ నెల 29న‌ ఉద‌యం అఖిల ప్రియ వివాహం జ‌రుగ‌బోతుంది.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఆమె వివాహం జరగనుంది. దీంతో భూమా కుటుంబం పెళ్లిని గ్రాండ్‌గా జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను అంద‌జేసే కార్య‌క్ర‌మంలో బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, అఖిల ప్రియ‌ త‌న‌ వివాహా ప‌త్రిక‌ను అంద‌జేశారు. అఖిల ప్రియ‌, త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి కేటీఆర్‌కు వివాహ‌ ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు.అలాగే కేటీఆర్‌తో పాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు శుభ‌లేఖ‌ను అంద‌జేశారు అఖిల ప్రియ‌.

ఈ క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్‌ కుటుంబానికి కూడా పెళ్లి శుభలేఖను అఖిల ప్రియ అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు జ‌గ‌న్ ఇంటికి వెళ్లి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు  త‌న పెళ్లి ఆహ్వాన‌ ప‌త్రిక‌ను అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌టంతో కుటుంబ స‌భ్యుల‌కు అఖిల‌ప్రియ త‌న పెళ్లి శుభ‌లేఖ‌ను అందించ‌నున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here