వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సీఆర్ డీఏ రైతులు

31

ప్రజాసంకల్పయాత్ర భాగంగా కుయ్యేరు వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రాజదాని ప్రాంత పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు ల్యాండింగ్ పూలింగ్ పేరుతో బెదిరించి ఇప్పటికే రైతులనుంచి 54 వేల ఎకరాలు లాక్కున్నారు:రైతులు

ల్యాండ్ ఇవ్వని 2 వేల ఎకరాల రైతులను భూములు ఇవ్వాలి లేదంటే లాం అక్విజేషన్ క్రింద లాక్కొని స్వచ్చందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని బెదిరిస్తున్నారు: రైతులు

మాకు లోన్లు, సబ్సిడీలు, నీరు రాకుండా అడ్డుకుంటున్నారు: సీఆర్డీఏ రైతులు

సేకరించిన 54 వేల ఎకరాల్లో రాజదాని నిర్మాణానికి కావాల్సింది 900 ఎకరాలు:సీఆర్డీఏ రైతులు

ఇప్పటికీ ఒక్క నిర్మాణం చేపట్టకుండా భూములకోసం మమ్మల్ని వేదించటం ఎంతవరకు న్యాయం: సీఆర్డీఏ రైతులు

అందుకే మా సమస్యలు చెప్పుకునేందుకుజగన్ మోహన్ రెడ్డి గారిని కలిసాం: సీఆర్డీఏ రైతులు

అధికారంలోకి వచ్చాక రాజదాని రైతులకు న్యాయం చేస్తామని జగన్ చెప్పారు ఆయనపై మాకు నమ్మకం ఉంది: రాజదాని రైతులు

వైఎస్ జగన్ ను కలిసిన కే.గంగవరం మండలం గోపాల్ రావు పేట గ్రామస్థులు

తమ గ్రామ రోడ్డు దుస్థితిని జగన్ మోహన్ రెడ్డిగారి దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్థులు

అడుగు తీసి అడుగు వేయలంటే రోడ్డు బాగాలేక అవస్థలు పడుతున్నాం. సైకిల్ పై కూడా స్కూల్ కు వెళ్లేందుకు రోడ్డు సమస్యగా మారిందంటున్న చిన్నారులు 10 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ హయంలో తారు రోడ్డు వేశారు. అతర్వాత పట్టించుకునే వారు లేక రోడ్డు కొట్టుకుపోయి మట్టి రోడ్డుగా మారిందంటున్న గ్రామస్థులు చిన్న చినుకు పడితే రోడ్డంతా బురదమయం ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదు: గ్రామస్థులు

కె.గంగవరం రైతులు

టిడిపి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తోంది. ఋణమాఫీ అని చెప్పి గ్రామల్లో ఏ ఒక్కరికీ మాఫీ చేయలేదు ఋణమాఫీ జరగక బ్యాంకువాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు.

రెండో పంటకు నీరందక పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు.అప్పులు చేసి పెట్టిన పెట్టుబడికి కూడా గిట్టుభాటు ధర పలకటంలేదుగిట్టుబాటు ధర విషయంలో టిడిపి ప్రభుత్వం విఫలమైంది.

రాజన్న తనయుడిగా జగన్ అన్న మీదే రైతులు నమ్మకంగా ఉన్నారు ఆయన అధికారంలో వస్తేనే మళ్లీ రాజన్న రాజాయంలో రైతులకు మేలు జరుగుతుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here