వెలగపూడి సచివాలయం తరలిపోనుందా ?

188

వెలగపూడి సచివాలయం తరలిపోనుందా ? జగన్ ముందున్న రిపోర్ట్ లో, సచివాలయం ఎక్కడ నిర్ణయించారు ?వెలగపూడిలో ఉన్న సచివాలయం మార్చమని, కొంత మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు. మంగళగిరిలో సచివాలయం ఉంటే బాగుంటుంది అని, జగన్ కు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెలగపూడితో పోలిస్తే, మంగళగిరి ఎందుకు అనువైన ప్రాంతమో చెప్తూ, అన్ని వివరాలు ఆ రిపోర్ట్ లో పొందుపరిచారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ముందుకు రావటంతో, జగన్ కూడా ఈ విషయంలో, సానుకూలంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మంగళగిరి ప్రాంతంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ అనువుగా ఉంటుందని, ఆ రిపోర్ట్ లో చెప్పినట్టు సమాచారం. అది కాని పక్షంలో, ఎక్కడైనా స్థలం చూసి, నిర్మాణాలు చేపడితే, సంవత్సరంలోనే అయిపోతుందని, కొత్త సచివాలయం మంగళగిరిలో ఉంటె అన్ని రకాలుగా బాగుటుందని సూచించారు. ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయం విజయవాడకు 18 కిలోమీటర్లు, గురటూరుకు 25 కిలోమీటర్లు, మంగళగిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రతి రోజు అక్కడకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని, వీరి వాపోతున్నారు.ప్రతి రోజు జగన్ తాడేపల్లి నివాసానికి, వెలగపూడికి, మధ్యలో గుంటూరు, విజయవాడకు వెళ్ళాలి అంటే, సమయం మొత్తం ప్రయాణానికే సరిపోతుందని వీరు వాపోతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఇప్పటికే అమరావతిలో, ఐఏఎస్ ల కోసం, అదిరిపోయే నివాసాలు చంద్రబాబు నిర్మించారు. వాటిని ప్రారంభించకుండా ప్రస్తుత ప్రభుత్వం ఆపింది. అక్కడకు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తే, ఒక ఎకో సిస్టం అక్కడ తయారు ఆవుతుందని తెలిసినా, అటు వైపుగా ఆలోచన చెయ్యటం లేదు. ఈ ఆఫీసర్లు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వారే. మరి హైదరాబాద్ లో, వీళ్ళు సగటున 15 కిమీ కూడా ప్రయాణం చెయ్యలేదా అంటే, వారే సమాధానం చెప్పాలి. అమరావతిని మార్చేసే విషయంలో, ఒక నిర్ణయం తీసుకుని, నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ మారుస్తూ, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here