‘వెక్కిరింత’ ఆడియో ఆవిష్కరణ

372

vekkirintha

కాక‌ర్ల రాహుల్‌, శ్వేత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ లాస్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కత్వంలో కాక‌ర్ల నాగ‌మ‌ణి నిర్మించిన చిత్రం `వెక్కిరింత‌`. కాక‌ర్ల‌, నాని(శ్రీధ‌ర్‌), వినీత్‌, ప్రేయ‌సి నాయ‌క్‌, మౌనిక రెడ్డి ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించిన ఈష చిత్రానికి చంద్ర‌లేఖ‌, భానుప్ర‌సాద్‌.జె సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను సాయి వెంక‌ట్ విడుద‌ల చేసి తొలి సీడీని ఘంటాడి కృష్ణకు అంద‌జేశారు
సినిమాలోని ఐదు పాటలను ఘంటాడి కృష్ణ‌, మ‌హిత్ నారాయ‌ణ్‌, ఖుద్దూస్‌, బ‌ల్లేప‌ల్లి మోహ‌న్‌, సింహాలు హాజ‌రై పాట‌ల‌ను విడుద‌ల చేశారు. టైటిల్ చాలా బావుంది. వెక్కిరింత అనే టైటిల్‌ను తేలిక‌గా తీసుకోకూడ‌దు. ఈ ఏడాది చిన్న చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అదే దారిలో ఈ సినిమా, ఆడియో పెద్ద హిట్ కావాల‌ని వారు టీంను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన సాయి వెంక‌ట్ చిత్ర‌యూనిట్ ను అభినందించి ఈ ఏడాది చిన్న చిత్రాలు మంచి విజ‌యాన్ని అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. సినిమా బాగా వ‌చ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది. మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. నిర్మాత‌లు ముగ్గురు మంచి మిత్రులు త్రిమూర్తులుల్లాగా నాకు అండ‌గా నిల‌డ‌టంతో సినిమాను అనుకున్న సమ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగానంటూ దర్శకుడు జంగాల నాగ‌బాబు తెలిపారు. మంటి టెక్నిక‌ల్ టీంతో, యాక్ట‌ర్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. అంద‌రూ కొత్త‌వారైనా అనుభ‌మున్న న‌టుల్లా న‌టించి స‌హక‌రించారు. ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి. సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్న‌ట్లు కాక‌ర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు తెలియ‌జేశారు. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ చంద్ర‌లేఖ‌, భానుప్ర‌సాద్‌లు థాంక్స్ చెప్పారు.
ఈ చిత్రానికి , సాహిత్యం: మ‌నాశ్రీ, ఎస్‌.కె.షాహి, ఎడిట‌ర్ః నాగార్జున‌.ఎం, సంగీతం: చంద్ర‌లేఖ‌, కెమెరాః వాసిరెడ్డి స‌త్యానంద్‌, భానుప్ర‌సాద్‌.జెడైలాగ్స్ః సాయి రామ‌కృష్ణ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ః కె.శ్రీధ‌ర్‌, టి.ప‌ద్మ‌ల‌త‌, న‌ల్లా వ‌రుణ్‌తేజ్‌, నిర్మాతః కాక‌ర్ల నాగ‌మ‌ణి, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: జంగాల నాగ‌బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here