విధ్వంస రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు:విజయసాయిరెడ్డి

44

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు.‘‘ హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి.. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా..?

రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు.

వైఎస్‌ జగన్ దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇది ఇలా వుంటే వైసిపి ప్రభుత్వం 60రోజుల్లో అనేక కంపెనీలు తిరుగుముఖం పెట్టగా, వైజాగ్ నుండి పెటీయం కంపెనీ సైతం ముసివేతకు సిద్ధపడింది…. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకులు సైతం జగన్ విధానాలతో అమరావతి నిర్మాణం నుంచి తప్పుకున్నాయి,

ఇదిలా ఉండగా జగన్ నిర్ణయంతో అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తుటుండగా, 108 ఉద్యోగులు సమ్మె బాట పట్టారు, సంక్షేమ పథకాలు అమలు విషయంలో సైతం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి,

గుంటూరు జిల్లా పోనుగుపాడు గ్రామంలో టిడిపి మద్దతుదారులు ఊరిలోని రాకుండా దారికి అడ్డంగా గోడకట్టిన సందర్భంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు “నిజనిధారణ కమిటీ” వేయటంతో ఆ కమిటీ సభ్యులు గ్రామంలో పర్యటించడానికి వెళ్ళగా పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో నికి వెళ్ళకుండా అడ్డుకున్నారు.వీటిని నుంచి ప్రజలను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రక్కదారి పట్టించి, వారి వైఫల్యానికప్పించికునే ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అంతే కాకుండా ఆయన మరో రహస్య ఎజెండాతో నడుస్తున్నారని సినీయర్ పాత్రికేయులు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here