విజయసాయిరెడ్డి పదవి వీడడం వెనుక షాకింగ్ రహస్యం ఇదేనా.!

109

వైసీపీలో నేనే నెంబర్ టూ అని చెప్పుకునే విజయసాయిరెడ్డికి ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. అయితే అనూహ్యంగా ఆయనను పదవి నుంచి తప్పిస్తూ అదే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసిపి శ్రేణులు షాక్ కు గురయ్యాయి. అయితే ఆయనను పదవినుంచి తప్పించడం వెనుక భారీ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ పదవి నుంచి తప్పించకుంటే అసలు ఎంపీ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవలే ఆయన్ని ఈ పదవిలో నియమించిన సంగతి తెలిసిందే.అయితే ఎంపీలుగా ఉన్నవాళ్లు లాభదాయక పదవు(ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌)ల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. ఎంపీలు లాభదాయక పదవుల్లో ఉంటే, వారి పార్లమెంటు సభ్యత్వంపైనే అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నియామకాన్ని రద్దు చేసింది. అయితే పదవి నుంచి తప్పించినా ఆ పదవిలో ఉన్న రెండు వారాలు ఇప్పుడు సాయిరెడ్డికి గుది బండగా మారాయని తెలుస్తోంది, లాభాపేక్ష కలిగిన పదవిలో 13 రోజులు కొనసాగినందుకు విజయసాయిరెడ్డిని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించి ఆయనపై వేటు వేయాలని ఆంద్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 102 (1)ఏ ప్రకారం ఆయనను ఎంపీ పదవికి అనర్హుడిగా ఈసీ తక్షణం ప్రకటించాలన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసినా అనర్హత తప్పదని, తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఆయనకు ఆ పదవి ఇస్తూ జీవో జారీ చేశారు.ఆ పదవిలో 13 రోజులు కొనసాగారు. చట్టం తెలియదని చెప్పడం కూడా చెల్లదు. ఆయనపై ఎన్నికల సంఘం చర్య తీసుకోక తప్పదు. మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని నివేదిస్తాం’ అని యనమల తెలిపారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేయడానికి ఈ పదవిని పొందిన విజయసాయిరెడ్డి చట్టానికి దొరికిపోయి దాని నుంచి తప్పించుకొనేందుకు జీవోను రద్దు చేయించుకొన్నారని ఆయన విమర్శించారు. ముగ్గురు ఎంపీలను మంత్రివర్గ ఉప సంఘంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా పరిశీలనకు వచ్చిన లేదా తెలియవచ్చిన ఏ అంశం అయినా ఏ వ్యక్తికీ తెలియపర్చనని మంత్రులు చేసిన ప్రమాణానికి ఈ నియామకం విరుద్ధం.ఎంపీలను మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా నియమించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఒకవైపు రివర్స్‌ టెండరింగ్‌ అంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడటం, మరోవైపు కంట్రాక్టర్లను బెదిరించడం, ఇంకోవైపు వసూల్‌ రాజాలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంతో సీఎం జగన్‌ అవినీతి లోగుట్టు ప్రపంచానికి అంతా తెలుస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎంపీ పదవి గండంలో పడడంతో ప్రభుత్వం ఇచ్చిన పదవిని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. అయినా దీనిని తేలిగ్గా వదిలేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here