విజయసాయిరెడ్డికి అధికార దాహం పట్టుకుంది-మంత్రి జవహర్

104

విజయసాయిరెడ్డికి అధికార దాహం పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ సురక్షితంగా ఉన్న ఆధార్ డేటా చోరీకి గురైందని విజయసాయిరెడ్డి చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.

ఏపీలో ప్రభుత్వం వినియోగిస్తున్న డేటా సెంటర్,రియల్ టైమ్ గవర్నెన్స్ చూసి ఇతర దేశ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించిన విషయం గుర్తు చేశారు. దొంగ కంపెనీలు ఏర్పాటు చేయటం, ఆ సంస్థలకు ప్రభుత్వం నుంచి లబ్ది చేయడం వంటి పనులు జగన్, విజయసాయిరెడ్డికి దక్కిందన్నారు. పది రూపాయల షేర్ వాల్యూ లేని సంస్థల పేర్లను వేలు పెట్టి కొనుగోలు చేయడంలో జగన్ కి సలహా ఇచ్చారన్నారు.ఈ నేపథ్యంలోనే జగన్ రూ.లక్ష కోట్లకు చేరేలా విజయసాయిరెడ్డి పాత్ర పోషించాడని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఫోన్లను తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు.ఇప్పుడు ఏమీ తెలియనట్లు పత్రిక సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. నిజంగా ఆధార్ డేటా పోతే పోలీసులు ఫిర్యాదు చేయాలి లేదా కేంద్రానికి ఫిర్యాదు చేయాలే తప్ప మీడియా ముందుకు వచ్చి పిచ్చి కూతలు కూయటం వెనక ఏ కుట్ర ఉందో భయటపెట్టాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను అనుసరించి సేవామిత్ర అప్డేట్ చేసుకుంటే విజయసాయిరెడ్డి వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించారు. మీ పార్టీకి ఒక సిద్ధాంత విధానం పద్ధతి లేదు. టిడిపి పార్టీ పై పదే పదే విమర్శలు చేయడమే మీ పార్టీ సిద్దాతంగా పెట్టుకున్నారు. సీఎం డాష్ బోర్డు అంటే ఏంటో తెలియని వైఎస్ కి ఆయన డాష్ బోర్డ్ వినియోగించారని చెప్పటం సిగ్గుమాలిన తనమన్నారు. వైఎస్ హయాంలో పాలన మొత్తం పేపర్లపై జరగటంతో జగన్ రూ. లక్ష కోట్లు వెనకేసుకున్నాడు. జగన్ కూడా ఆడిటర్గా ఉన్న నీకు తెలియదా జగన్ అక్రమాస్తుల ఎలా బయటపడ్దోయో అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతంగా హత్య చేసి బావిలో పడేస్తే వెతకటానికి వారం పట్టింది కానీ అవేమీ వైయస్సార్ పార్టీకి కనిపించవు. ఇటీవలే 21 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుడటంపై స్పందించడానికి జగన్,విజయసాయిరెడ్డికి మనసు రాలేదన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పని చేస్తుంటే దిక్కుమాలిన రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారు.మీ లాంటి దిక్కుమాలిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు సభ్య సమాజం సిగ్గు పడుతుందని మంత్రి జవహర్ మండి పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here