విజయవాడలో 'సరైనోడు' సంబరాలు

88

IMG-20160503-WA0000
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ… ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈనెల 4న విజయవాడలోని సిద్ధార్థ హోట‌ల్ మెనేజ్‌మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో సరైనోడు సక్సెస్ సంబరాల్ని కలర్ ఫుల్ గా చేయనున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, రకుల్, కేథరీన్ తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్న చిత్రంగా సరైనోడు నిలిచింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా రిపీట్ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తోంది సరైనోడు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులు, మెగాభిమానుల సమక్షంలో విజయోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాం. ఈనెల 4వ తేదీన విజయవాడలోని సిద్ధార్థ హోట‌ల్ మెనేజ్‌మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ ను చేయనున్నాం. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరవుతుంది. అని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here