వింత చేప కాదు.. క‌ళాకారుడి అద్భుతం!


విశాఖ‌లో మ‌నిషిలాంటి వింత చేప అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఆ వీడియో వెనుక అస‌లు ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డింది. అది, అస్స‌లు జీవే కాద‌ని, ఓ క‌ళాకారుడు రూపొందించిన క‌ళాఖండ‌మ‌ని తెలిసింది. దీని వెనుక ఉన్న అస‌లు గుట్టు ఏమిట‌నీ స‌మ‌యం టీమ్ అన్వేషించగా వాస్త‌వం బ‌య‌ట‌ప‌డింది. మ‌య‌న్మార్‌కు చెందిన ఓ క‌ళాకారుడు చెక్క‌, ఫైబ‌ర్ వినియోగించి ఈ క‌ళాఖండాన్ని రూపొందించిన‌ట్లు మ‌య‌న్మార్ ప‌త్రిక‌లు వెల్ల‌డించారు. ఈ క‌ళాఖండం సహజంగా క‌నిపించేందుకు దాని గొంతు భాగంలో మోటారును ఏర్పాటు చేశారు. ఈ క‌ళాఖండానికి చెందిన ఫొటోలు, వీడియోలు.. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. చివ‌రికి పాకిస్థాన్లో సైతం పాక్ స‌ముద్ర జ‌లాల్లో ఇది ల‌భించింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కొంద‌రు ఇది విశాఖ‌ప‌ట్నంలోనే దొరికిందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా వైర‌ల్ గా షేర‌వుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *