‘వాళ్లిద్దరి మధ్య’ ఏం జరిగింది..?

91

ఆ ఇద్దరూ గురుశిష్యులు. గురువు దగ్గర ఓనమాలు నేర్చుకున్న శిష్యుడు దర్శకుడిగాఎ దిగాడు. మంచి విజయాలు సాధించి గురువు పేరు నిలబెట్టాడు. పాతికేళ్లు గడిచాయి.గురువు సతీసమేతంగా శిష్యుడి సినిమా సెట్ కు వచ్చి ఓ సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఆ శిష్యుడు సవినయంగా తన గురువు దర్శకత్వం వహించే సన్నివేశానికి క్లాప్కొ ట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ‘వాళ్లిద్దరి మధ్య’జరిగిన పాతికేళ్ల క్లాప్ కథ వెనుక ఉన్న పాత్రధారులు మరెవరో కాదు అలనాటి మేటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు,వి.ఎన్.ఆదిత్య. మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో ఈ ఘటన జరిగింది. విరాజ్ అశ్విన్ , నేహాకృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ‘వాళ్ళిద్దరిమధ్య’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్రున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు ఎలా క్లాప్ కొట్టారో… ఇప్పుడు మళ్లీ అలా కొట్టడంతో ‘క్లాప్స్’కొట్టకుండా ఎవరుంటారు చెప్పండి. పైగా సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించినందుకు నేటి తరం నటులు కూడా ఎంతో సంబరపడ్డారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రుల మీద ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ మధురానుభూతి గురించి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ ‘’వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. నా గురువు సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను’’ అన్నారు. ‘’పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు , వివేక్ కూచిబొట్ల గారు కూడా ఆ రోజు అతిథులుగా మా షూటింగ్ కు వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. నిర్మాత అర్జున్ దాస్యన్ గారు పట్టుబట్టలు పెట్టి ఆ దంపతులను సత్కరించారు. హాఫ్ డే ఆయన మాతోనే గడిపారు’’ అని వీఎన్ ఆదిత్య వివరించారు. ఆ గురువుకు ఇంతకంటే శిష్యోత్సాహం ఇంకేముంటుంది. ‘వాళ్లిద్దరి మధ్య’ షూటింగ్ విశేషాల్లోకి వస్తే ఈ సినిమా షూటింగ్ నవంబరు 25కల్లా పూర్తవుతుందని నిర్మాత అర్జున్ దాస్యన్ చెప్పారు. ఇందులో ఇంకా వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్
అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ
తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక బృందం :
స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి
.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకే
మూర్తి,
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్ : సూరపనేని కిషోర్, నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.
ఆదిత్య .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here