‘వనం-మనం’ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది

32

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే కోటి మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వనం-మనం’ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వనం-మనం’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 శాతం పచ్చదనం ఉందని.. 2029నాటికి దానిని 50శాతానికి చేర్చాలన్నారు. దీనికోసం ప్రజలందరూ వనదీక్ష చేపట్టాలని సూచించారు. ఇకపై శుభకార్యాలకు బహుమతులుగా మొక్కలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 40లక్షల హెక్టార్లలో అదనంగా చెట్లు నాటాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ‘వనం- మనం’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వాడవాడలా మొక్కలు నాటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here