వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో “లావణ్య విత్ లవ్ బాయ్స్”

52

2017-03-18_23.38.36 పరుచూరి గోపాలకృష్ణ, కాశీవిశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవల పతాక సన్నివేశాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే అందమైన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. చక్కటి కథా, కథనాలతో పాటు మాటలు, పాటలు అన్ని అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పతాక సన్నివేశాలు చిత్రీకరించాం. అని తెలిపారు. కాశీవిశ్వనాథ్, పరుచూరి గోపాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నర్సింహులు పటేల్‌చెట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here