లోక్ సభలో “బెజవాడ బాషా”

102


రాజకీయాలలో,ప్రజాసేవలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని తీరే వేరు. ఎటువంటి క్లిష్ట సమయంలో నైనా అత్యుత్తమంగా స్పందించి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోగల చాకచక్యం ఆయన సొంతం.లోక్ సభలో తెలుగుదేశం ఎంపీ లు యెంత తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపినా మొదటి రోజు సాదాసీదా గానే గడిచింది. కానీ రెండవ రోజు టీడీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియ చేస్తున్న సమయంలో కేశినేని నాని ప్లకార్డ్ ను తిరగేసి పట్టుకున్న విషయాన్ని గమనించిన సోనియా గాంధీ ఆ విషయాన్ని సైగల ద్వారా తెలియచేసినా ఆయన గమనించలేదు.ఆ సంగతిని వివరించాలని దగ్గరకు వచ్చిన సిపిఎం సభ్యునిపై ( కాంగ్రెస్ వానిగా భావించి ) “మీ విధానం వలెనే మా రాష్ట్రం తలక్రిందులవుతోంది ” అని తీవ్రంగా మండిపడటంతో సభలో వాతావరణం వేడెక్కింది.
అదేసమయంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే కి వచ్చింది.ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సైతం టీడీపీ ఎంపీ లు ఆందోళన చేయడంతో కాంగ్రెస్,తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి.ఖర్గే మొఖం కనపడకుండా అడ్డుగా నిలుచున్న కేశినేని నాని ని అడ్డుతప్పుకోవలసిందిగా ఖర్గే రెండు సార్లు జబ్బ మీద తట్టారు.దానిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ,సోనియా గాంధీ కలిపించుకుని ఖర్గే ను వారించారు.తెలుగుదేశం సభ్యులు ఆందోళన తీవ్రం చేయడంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు.వాయిదా వేసాక కూడా కాంగ్రెస్,తెదేపా మధ్య వాదోపవాదాలు కొనసాగాయి.
ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విజయవాడ ఎంపీ కేశినేని నానిని పిలిచారు.దాంతో ఆమె సీట్ వద్దకు నాని వెళ్లారు.కాంగ్రెస్ సభ్యులకు ఎందుకు అడ్డు తగులుతున్నారు,ఎందుకు వాదులాడుతున్నారు అని ప్రశ్నించారు.వెంటనే నాని కాంగ్రెస్ ను కాక ఎవరిని అనాలి.యూపీఏ అధికారం లోకి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మీకు అత్యధిక సీట్లు ఇచ్చింది.కానీ రాజకీయ స్వార్ధంతో రాష్ట్ర విభజనను చాలా దారుణంగా చేశారు.ఈ రోజు పార్లమెంట్ లో మేము నిరసన తెలిపే పరిస్థితి రావడానికి కూడా మీరే కారణం.మీ వల్లే ఆంధ్రప్రదేశ్ నష్ట పోయింది.పోనీ విభజనవల్ల కాంగ్రెస్ లాభపడిందా అంటే రెండు రాష్ట్రాలలోను దారుణంగా నష్ట పోయింది,కేంద్రంలోను అధికారాన్ని కోల్పోయింది అని సూటిగా,నిర్మొహమాటంగా చెప్పడంతో బిత్తర పోవడం సోనియా వంతయింది.తేరుకున్న సోనియా చెమర్చిన కళ్ళతో ఆమోదంగా తలూపడం గమనించిన తోటి సభ్యులు ఒక జాతీయపార్టీ మాజీ అధ్యక్షురాలు,ఇందిరా గాంధీ కుటుంబ సభ్యురాలితో నిజాయతీగా మాట్లాడిన కేశినేనిని అభినందనలతో ముంచెత్తారు.
కానీ ఈ సంఘటన తరువాత సోనియా గాంధీ కేశినేని నాని గురించి వాకబు చేసి ఆయన కుటుంబ నేపధ్యం,టాటా ట్రస్ట్ ద్వారా ఆరోగ్య భరోసా కలిపించిన వైనం,నియోజకవర్గం లోని 265 గ్రామాలను అభివృద్ధి చేస్తున్న విధానం,మొదటిసారి ఎంపీగా ఎన్నికైనా అత్యుత్తమ ప్రజా ప్రతినిధిగా ఎదిగిన సంగతి తెలుసుకున్నారు.మరుసటి రోజు ఆమె కేశినేని నాని,తోట నరసింహం రామ్మోహన్ నాయుడు లను పిలచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సంఘటన ఆమెలో ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూల మార్పును తీసుకు వచ్చిందనేది యదార్ధం.తరువాత నుండి కాంగ్రెస్ సభ్యులు టీడీపీ కి సానుకూలంగా ప్రవర్తించడమే కాకుండా,సాక్షాత్తు సోనియా గాంధీ నే మన ఎంపీ లు “వుయ్ వాంట్ “అనగానే “జస్టిస్” అని గళం కలపడం విశేషం.తరువాత నుండి టీఆర్ఎస్ తో సహా అనేక పార్టీలు ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here