రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్లిన సీఎం చంద్రబాబు

12

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 7.00 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విశాఖపట్నం వచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, జివిఎంసి కమిషనర్ ఎం. హరి నారాయణన్, వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ పి. బసంత కుమార్, పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లఁడ్డా తదితరులు ముఖ్యమంత్రికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తో కలసి ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైతే విశాఖ జిల్లా కూడా సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. నేటి రాత్రి శ్రీకాకుళం జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అందించాల్సిన సహాయ చర్యలపై స్పష్టమైన ఆదేశాలుజారీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు. నేటి రాత్రి శ్రీకాకుళంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లాపై తుఫాను ప్రభావం అంతగా లేదని, కనీసం వర్షాలు అన్నా కురిస్తే, రైవాడ, పెద్దేరు, తాటిపూడి తదితర జలాశయాల్లో నీరు చేరే అవకాశం ఉండేదన్నారు. జిల్లాలో 20 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని, ఈ తుఫాను వల్ల వర్షాలు పడితే ఈ లోటు భర్తీ అయ్యేదని ఆశాభావాన్ని ముఖ్యమంత్రి కూడా వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. విశాఖ జిల్లా నుండి గంజాం పోర్టుకు వెళ్లిన సుమారు 50 బొట్లు సురక్షితంగా ఉన్నాయని, మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్న వాటిలో రెండు బోట్లు కు చెందిన తొమ్మిది మంది తిరుగు ప్రయాణం అయ్యారన్నారు. వారిలో ఆరుగురు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని, మిగిలిన వారి జాడ తెలియాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై ఒడిస్సా అధికారులు మరియు గంజాం పోటో అధికారులతో సంప్రద జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. వీరి జాడపై రేపు ఉదయానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here