రివ్యూ:రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్… సాహసం శ్వాసగా సాగిపో!

229
తారాగణం: నాగచైతన్య, మంజిమామోహన్, బాబా సెహగల్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: గౌతమ్ మీనెన్
రేటింగ్:3
 గౌతమ్ మీనెన్ దర్శకత్వంలో ఏ మాయ చేశావె చిత్రంలో నాగచైతన్య లవర్ బోయ్ గా కనిపించి.. అప్పటి నుంచి లవర్ బోయ్ అనే ముద్రనే కంటిన్యూ చేస్తున్నాడు. మొన్న విడుదలైన ప్రేమమ్ మూవీతో ఇది మరోసారి రుజువైంది కూడా. ఈ మధ్యలో విడుదలైన అనేక యాక్షన్ చిత్రాలన్నీ నిరాశే పరిచాయి. తాజాగా మరోసారి గౌతమ్ మీనెన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీతో వచ్చాడు. ఇది రొమాంటిక్ క్రైమ్ లవ్ స్టోరీ. మరి గతంలో లానే.. ఈ చిత్రం కూడా వీరి హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేసిందేమో చూద్దామా?
స్టోరీ: రజనీకాంత్(నాగచైతన్య) డిగ్రీ కంప్లీట్ చేసి… ఉద్యోగం కోసం ఎదురుచూసే కుర్రాడు. తన చెల్లిద్వారా పరిచయం అయిన లీలా(మంజిమా మోహన్)ను తొలిచూపులో నుంచే ప్రేమించడం మొదలెడతాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతారు కానీ… బయటకు మాత్రం ఎక్స్ ప్రెస్ చేయరు. అయితే ఓసారి రజనీకాంత్ తనకు ఎంతో కాలం నుంచి కోరికగా వున్న కన్యకుమారికి బైక్ పై వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అయితే లీలా కూడా నీతో పాటు వస్తానంటుంది. ఇలా ఇద్దరూ కన్యాకుమారికి బైక్ పై వెళుతుండగా.. మార్గం మధ్యలో ఓ లారి ఎదురుగా వచ్చి ఢీ కొడుతుంది. ఈ యాక్సిడెంట్ లో రజనీకాంత్ కి తీవ్రగాయలవుతాయి. దాంతో లీలా అతన్ని ఆసుపత్రిలో చేర్పించి కనిపించకుండా పోతుంది. మూడు రోజుల తరువాత రజనీకాంత్ కి ఫోన్ చేసి… మనకు యాక్సిడెంట్ కాదు జరిగింది.. నన్ను చంపాలనే అలా కొంత మంది ప్లాన్ చేశారని.. అందులో భాగంగానే తన తల్లిదండ్రులపైనా మర్డర్ అటెంప్ట్ జరిగిందని రజనీకాంత్ కు చెబుతుంది. దాంతో రజనీకాంత్ షాక్ గురయ్యి.. వెంటనే లీలా తల్లిదండ్రులు చికిత్సపొందే ఆసుపత్రికి వెళతాడు. అక్కడ మళ్లీ అటాక్ జరుగుతుంది. అక్కణ్నించు వారిని తప్పించి.. దుండగుల బారి నుంచి లీలా.. ఆమె తల్లిదండ్రులను కాపాడటాపికి శతవిధాలా ప్రయత్నింస్తుంటాడు. అయితే దుండగులతోపాటు.. పోలీసులు కూడా వీరిని అంతమొదించాలని చూస్తుంటారు. ఇలా దుండగులు.. పోలీసుల బారి నుంచి లీలా… ఆమె తల్లిదండ్రులను కాపాడటమే విధిగా మారుతుంది రజనీకాంత్ కు. మరి రజనీకాంత్ లీలాతో పాటు వారి తల్లిదండ్రులను చివరి దాకా కాపాడగలిగాడా? అసలు వారిని చంపాలనుకుంటున్నది ఎవరు? చివరకు ఏం జరిగిందనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: ఎప్పుడూ క్యూట్ లవ్ స్టోరీలను తీసే గౌతమ్ మీనెన్.. అప్పుడప్పుడు ఘర్షణ లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ని కూడా తీసిన అనుభవం ఆయనది. ఒక్కోసారి ఇలాంటి ప్రయోగాలు ఫలితాలివ్వకపోయినా… ఆయనకు తోచినంతలో అలాంటి స్టోరీలను అటెంప్ట్ చేస్తుంటాడు. తాజాగా చైతూతో కూడా సాహసం శ్వాసగా సాగిపో అనే రొమాంటిక్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించాడు. మొదటి భాగం మొత్తం ఏ మాయ చేశావే టైపులో కూల్ లవ్ స్టోరీతో నడిపించేసి.. మరోసారి చైతూను లవర్ బోయ్ గా ఎంత బాగా చూపించగలనో అని నిరూపించుకున్నాడు. అలానే మలీవుడ్ బ్యూటీ మంజిమా మోహన్ కూడా ఆ లవ్ స్టోరీకి చైతూ పక్కన కరెక్ట్ గా సరిపోయింది. ఏమాయ చేశావెలో సమంతను ఎంత బ్యూటిఫుల్ గా చూపించాడో… ఇందులోనూ మంజిమా అంతే బ్యూటిఫుల్ గా చైతూ పక్కన కనిపించింది. ఇలా మొదటి హాఫ్ లో కూల్ లవ్ స్టోరీని నడిపించేసి.. సెకెండాఫ్ లో క్రైమ్ స్టోరీతో నడిపించాడు. ద్వితీయభాగం మొత్తం హీరోయిన్ తో పాటు.. వారి తల్లిదండ్రులను రౌడీల నుంచి కాపడటానికి రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా వీక్ గా వుండటంతో.. ఈ సినిమా యావరేజ్  టాక్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బలమైన ఎమోషన్ ఎక్కడా క్యారీ కాలేదు. కేవలం వెంబడించే రౌడీలను  గన్ తో కాల్చివేస్తూ… ముందుకు సాగిపోవడం వల్ల ఎక్కడా ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. ఒక సీన్ లో చనిపోయినట్టు కనిపించే రౌడీ.. మరోసీన్ లో బతికి రావడం.. రౌడీలు అంతలా గన్ తో కాల్చినా.. హీరోకు మాత్రం తగలకుండా.. కేవలం హీరో కాలిస్తే.. రౌడీలు నేలకొరగడం లాంటి సీన్లు చాలానే చూసేసున్నాం. ఇలాంటి సీన్లతో మరోసారి బోర్ కొట్టించేశాడు గౌతమ్.
ఈ సినిమాలో చైతూ.. మంజిమా జోడీ తప్ప.. మిగతా పాత్రలన్నీ ఎవరికీ అర్థం కావు.. గుర్తు పట్టలేరు. అంతలా స్టార్ కాస్ట్ వుంది. తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టే ఒక్క క్యారెక్టరు ఇందులో కనిపించరు. బాబా సెహగల్ మాత్రం పోలీసు పాత్రలో కనిపించాడు. అతన్ని కొందరు మాత్రమే గుర్తించే అవకాశం వుంది. ఇందులో స్టార్ కాస్ట్ పెద్ద మైనస్. బైలింగ్వల్ కావడంతోనే ఇలా జరిగిందని చెప్పొచ్చు. చైతూ.. మంజిమా జోడీ బాగుంది. మంజిమా చాలా అందంగా కనిపించింది. చైతూ కూడా లవర్ బోయ్ గా మెప్పించాడు. యాక్షన్ పార్టులో మాత్రం తేలిపోయాడు. పైగా అతను ఐ.పి.ఎస్.ఆఫీసర్ అయ్యే బిల్డప్ మరీ డ్రమటిక్ గా వుంది. కథ రొటీన్ దే అయినప్పుడు.. బలమైన స్క్రీన్ ప్లే రాసుకోవాలి. ఇందులో ఇవేవీ లేవు. దాంతో గౌతమ్ మీనన్ మరోసారి రొటీన్ క్రైమ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల్ని బోర్ కొట్టించేశాడు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. సెకెండాఫ్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. కోన వెంకట్ రాసిన పొడి పొడి మాటలు యూత్ కి కనెక్ట్ అవుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here