రైల్వేజోన్‌ ఇవ్వకపోతే అడ్రస్‌ గల్లంతు చేయాలి: చంద్రబాబ

పోలవరం ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. నగరంలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తన జీవిత ఆశయమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. నదుల అనుసంధానానికి కేంద్రం సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రైల్వేజోన్‌ మన హక్కు అని స్పష్టం చేశారు.

రైల్వేజోన్‌ ఇవ్వకపోతే అడ్రస్‌ గల్లంతు చేయాలని పిలుపు నిచ్చారు. నాలుగు డివిజన్లు ఉన్నా… రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీజేపీకి వత్తాసు పలికే పార్టీలకు గుణపాఠం చెప్పాలని వెల్లడించారు. రాష్ట్ర యువత ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర విద్యాసంస్థలకు అరకొర నిధులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగువారంటే లెక్కలేని తనం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆంధ్రులు పన్నులు కట్టడంలేదా? ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. టీడీపీ తల్చుకుంటే మీ అడ్రస్‌ గల్లతవడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *