రైల్వేజోన్‌కు ఒడిశా అడ్డుపడుతుందనడంలో వాస్తవంలేదు: పవన్

69

రైల్వేజోన్‌కు ఒడిశా అడ్డుపడుతుందనడంలో వాస్తవంలేదని పవన్ కల్యాణ్ అన్నారు. పలాస నిరసన కవాతు యాత్రలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చట్టసభల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని, కేంద్రంపై ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసమే జనసేనను స్థాపించామని అన్నారు. 2019లో జనసేన ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here