రైతులకు అండగా ఉంటా…పవన్ కళ్యాణ్

45

pawanఏపీ రాజధాని కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఉద్దేశించి జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి మీడియాతో పవన్ మాట్లాడారు. సమస్యను పరిష్కరించడానికి చావుకు కూడా భయపడనని తెలిపారు. పరిపాలనా వ్యవస్ధలో లోపాలున్నాయన్నారు. నేనెప్పుడు ఏ పార్టీ పక్షం కాదు నేను ప్రజల పక్షం…. చర్చల ద్వారా చాలా సమస్యలు తీరుతాయి… అలా కాదని గొడవల ద్వారానే సమస్యలు తీరుతాయంటే అందుకు నేను సిధ్దమే అన్నారు. మీరేం చేసిన చూస్తూ ఉండడానికి బానిసను కాదని తెదేపా నాయకులకు సవాలు విసిరారు. మీకు అండగా ఉంటాను ఎక్కడికి పారిపోను. నేనెప్పుడూ జనం పక్షం.. అభివృద్ధికి అటంకం కలిగించే వాడినే అయితే తెదేపాకు ఎందుకు మద్దతిస్తాను. నా చిత్తశుద్దిని శంకిస్తే ఎంతకైన తెగిస్తా. రైతులకోసం ఎందుదూరమైన వెళ్లడానికి నేను సిద్దం. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తన భూమి పోతోందంటూ ఎంపీ మురళీ మోహన్ కోర్టుకెళ్ళిన సంగతిని పవన్ గుర్తు చేశారు. ఆయనకు కూడా చాలా ఆస్తులున్నాయని పేర్కొంటూ, కొద్దిపాటి భూమి కోసం మురళీ మోహన్ కోర్టుకెక్కినప్పుడు, భూమిపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్న రైతులు దాని కోసం పోరాడటంలో తప్పేముందని అడిగారు. రైతుకు అన్నం పెడుతున్న భూమి విషయంలో మంత్రి కిషోర్ బాబు ఆఫ్ట్రాల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని పవన్ తప్పుబట్టారు. అన్నదాత కన్నీళ్ళతో రాజధాని కట్టడం మంచిది కాదంటూ తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్నయ్యను వదిలేసి వచ్చానన్నారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని చూడాలన్నది తన కోరిక అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here