'రేయ్' లో 'పవనిజం' స్పెషల్ సాంగ్

28

Rey-Pawanism-Song-Wallpapers-1సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా బొమ్మరిల్లు వారి పతాకంపై స్వీయ దర్శకత్వంలో వైవీఎస్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్‌’. సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా షూటింగ్ సమయంలోనే చాలా సమస్యలు ఎదుర్కొంది. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టింది. షూటింగ్ పూర్తయినా…వివిధ కారణాలతో సంవత్సర కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘రేయ్’ మూవీపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఈనెల 14న ప్లాన్ చేస్తున్నాడు. ‘రేయ్ విత్ పవనిజం’ పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here