రెవిన్యూ, విద్యుత్ అధికారుల దాష్టికం…ఎండుతున్న పంటలు!

33

కడప జిల్లా మైదుకూరు మండలం  శెట్టివారిపల్లె గ్రామంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అకారణంగా తొలగించిన విద్యుత్ అధికారులు. రైతులు పంట పండించుకునే సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎలా కనెక్షన్ తొలగిస్తారు అంటే కనీసం సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి లో విద్యుత్ అధికారులు ఉండటం శోచనీయం. ఏ కారణం చేత కనెక్షన్ తొలగించారో లిఖితపూర్వకంగా సమాధానం కోరితే నీళ్లు నములుతున్న అధికారులు. మైదుకూరు మండల తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు కనెక్షన్ తొలగించామని దాటేస్తున్న విద్యుత్ లఅధికారులు. 2011 అసైన్మెంట్ కమిటీ లో ప్రభుత్వం నుండి పొలాన్ని పొందిన విద్యుత్ కనెక్షన్ తీసుకున్న రైతులు. ప్రభుత్వ భూములను, వంకలను ఆక్రమించి అనుభవించే  వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేని, కనీసం అటువైపు చూడాటానికే ఇష్టపడని అధికారులకు. అసైన్మెంట్ కమిటీ లో ప్రభుత్వ భూమిని పొంది విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వీరిపై అధికారులు ఎందుకు కన్నెర్ర చేస్తున్నారో… లోగుట్టు చెప్పేది ఎవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here