‘రెడ్’ మూవీ ప్రారంభమైంది..!

84

రామ్‌ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించనున్న చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణ పోతినేని చిత్రసమర్పకులు. సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘జెమినీ’ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా… దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్‌ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, భోగవల్లి బాపినీడు, దామోదర ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, రామ్ ఆచంట, గోపీ ఆచంట తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రామ్‌ మాట్లాడుతూ ‘‘నా 18వ సినిమా ‘రెడ్‌’. దర్శకుడిగా కిషోర్‌తో మా సంస్థతో మూడో సినిమా. రచయితగా అంతకు ముందు మా సంస్థలో చాలా సినిమాలు చేశాడు. ఫస్ట్‌ టైమ్‌ కెరీర్‌లో ఒక థ్రిల్లర్‌ చేస్తున్నా. కమర్షియల్‌ అంశాలు కూడా ఉంటాయి. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. మంచి పాయింట్‌ తీసుకుని చేస్తున్నాం. మాస్‌ ఎలిమెంట్స్‌, క్లాస్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి. ముహూర్తమే కాబట్టి ఎక్కువ రివీల్‌ చేయకూడదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత సినిమా గురించి అనౌన్స్‌మెంట్‌ లేదేంటి? అని ఈమధ్య చాలామంది అడిగారు. ప్రీ ప్రొడక్షన్‌ అంతా చేసి, లుక్‌ సెట్‌ చేసి, టైటిల్‌ అనుకున్న తర్వాత వద్దామనుకున్నాం. అందుకుని, ఇంత ఆలస్యమైంది’’ అని అన్నారు.

‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ ‘‘సూపర్‌హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నటిస్తున్న చిత్రమిది. నవంబర్‌ 16న సెట్స్‌ మీదకు వెళుతుంది. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ చేస్తాం. ఏప్రిల్‌ 9, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. మా చిత్రానికి ముందు పెద్ద హిట్‌ ఇచ్చిన పూరిగారు, ఛార్మిగారికి థ్యాంక్స్‌. మరో సూపర్‌హిట్‌ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘స్రవంతి’ మూవీస్‌లో రామ్‌తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. కిషోర్‌తో మా సంస్థలో మూడో చిత్రమిది. తమిళ సినిమాను ఆధారంగా చేసుకుని చాలా మార్పులు చేశాం’’ అని అన్నారు.

కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘‘రామ్‌గారితో స్రవంతి మూవీస్‌లో మూడోసారి సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ‘రెడ్‌’ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ కూడా కొత్తగా ఉంటుంది. అలాగే, మా నుండి ప్రేక్షకులు ఆశించే అంశాలు అన్నీ సినిమాలో ఉంటాయి. ఫస్ట్‌ టైమ్‌ మణిశర్మగారితో పని చేస్తున్నాం. ఇది థ్రిల్లర్‌ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది’’ అని అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్‌: జునైద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here