రివ్యూ: మాస్ ను మెప్పించే.. జక్కన్న!

38

మూవీ: జక్కన్న
తారాగణం: సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు
సంగీతం: దినేష్
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ
రేటింగ్: 2.75
కమెడియన్ నుంచి హీరోగా మారిన తరువాత సునీల్ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఆ తరువాత నటించిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. నాగ చైతన్యతో కలిసి ‘తడాఖా’ చూపించినా.. ఆ తరువాత వచ్చిన కృష్ణాష్టమి నిరాశే మిగిల్చింది. అయితే ఇసారి మాత్రం పూర్తిగా కామెడీనే నమ్ముకొని ‘జక్కన్న’గా మన ముందుకొచ్చాడు. ఇందులో హీరోనే అయినా.. నేను చాలా కామెడీ చేశానంటున్నాడు సునీల్. మరి సునీల్ ఏమాత్రం ఆకట్టుకున్నాడో చూద్దాం.
తనకు మేలు చేసిన వారికి తిరగి ‘అంతకు మించి’ హెల్ప్ చేయాలనే మనస్థత్వం హీరోది. ఆ హెల్పింగ్ ఎంతలా వుంటుంది అంటే.. సహాయం పొందే వ్యక్తే.. అతని హెల్పింగ్ నేచర్ ని భరించలేక.. చంపేయాలనేంత ‘మంచితనం’ హీరోది. దాంతోనే.. అతని ప్రాణాల మీదకు తెచ్చుకున్నా.. మేలు చేసే తత్వాన్ని మాత్రం మానుకోలేని హీరో కథే… జక్కన్న.  స్టోరీ లైన్ అయితే బాగుంది. కానీ దాన్ని తెరమీద చూపించిన తీరే కొంత పేలవంగా వుంది. తొలి భాగం మొత్తం చాలా పేలవంగా వుంటుంది.
ద్వితీయార్థంలో అసలు కథలోకి ఎంటరైన తరువాత… సినిమా ఆసక్తిగా మారుతుందేమో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ప్రాసలతో కూడిన కామెడీ డైలాగులు విసుగు పుట్టిస్తాయి. ప్రతి సీనులోనూ లెంగ్తీ డైలాగులు వుండటంతో… అవేవీ ప్రేక్షకులను నవ్వించేలేవు. దాంతో అక్కడ కూడా నిరాశే మిగులుతుంది. పృథ్వీ చేసే బాలకృష్ణ డైలాగుల ఇమిటేషన్ మరీ ఓవర్ అనిపిస్తుంది. ఇప్పటికే చాలా చిత్రాల్లో ఇలాంటి డైలాగులను వాడేశారు. మళ్లీ వాటినే చెప్పడం వల్ల ప్రేక్షకులు ఏ సందర్భంలోనూ కనెక్ట్ అవ్వరు.
సునీల్ ఎప్పటి లాగే తన కామెడీ టైమింగ్ తో అలరించడానికి ట్రై చేశాడు. కానీ దర్శకుడి పేలవమైన దర్శకత్వం వల్ల అవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోవు. హీరోయిన్ కూడా కేవలం గ్లామర్ డాల్ గానే మిగిలిపోయింది. పాటలకు తప్ప.. ఈమె నుంచి ఆశించడానికేమీ లేదు. విలన్ గా చేసి కబీర్ సింగ్ ఎప్పటిలాగే రొటీన్ విలన్ పాత్రను పోషించాడు. సప్తగిరి కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. కేవలం కమెడియన్ కోసమే అన్నట్టుంది అతని పాత్ర. జబర్దస్థ్ రఘు క్యారెక్టర్ కూడా రొటీనే.
దర్శకుడి ఫెయిల్యూర్ బాగా కనిపిస్తుంది. ఒక్క సీను కూడా పండించలేకపోయాడు. సంగీతం అంతంత మాత్రమే. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సోసోనే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here