రివ్యూ: మనసును స్పృషించే… ‘మనమంతా’

199

రేటింగ్: 3.5
చాలా కాలం అయింది పరభాషా నటులు తెలుగులో పూర్తిస్థాయి హరో పాత్రలు పోషించి. అలా అంటే.. చాలా మంది పెద్ద స్టార్లు తెలుగులో ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించలేదనే చెప్పాలి. ఒక్క రజనీకాంత్ ఒక్కరే పెదరాయుడు చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు. మరే ఇతర స్టార్ హీరోలు తెలుగులో నేరుగా నటించింది లేదు. అయితే ఇప్పుడు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం తొలిసారిగా పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించిన సినిమా ‘మనమంతా’. దాదాపు 23 ఏళ్ల క్రితం బాలకృష్ణ నటించిన ‘గాండీవం’ చిత్రంలో ఓ పాటలో అలా మెరిసి వెళ్లిపోతాడు. ఆ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ఓ కీలక రోల్ లభించింది. అయితే ఈ చిత్రం తరువాత ప్రారంభమైన ‘మనమంతా’ చిత్రమే ముందుగా విడుదలైంది. ఇందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించడమే కాకుండా కేవలం 68 గంటల్లోనే తెలుగు నేర్చుకుని.. తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే గౌతమి కూడా దాదాపు 25 ఏళ్ల తరువాత తెలుగులో నటించారు. మరి వీరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ.. కథనం విశ్లేషణ: సాయిరాం(మోహన్ లాల్) ఓ మధ్య తరగతి కుంటుంబపు పెద్ద. ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటాడు. అతనితో పాటే విశ్వనాథ్(హర్షా) అనే వ్యక్తి పనిచేస్తుంటారు. అయితే సూపర్ మార్కెట్ మేనజర్ పోస్ట్ కోసం ఇద్దరి మధ్య పోటీ వుటుంది. అనుభవంతో సాయిరాం.. హై ఎడ్యుకేషన్ తో విశ్వనాథ్.. మేనేజర్ పోస్ట్ కోసం పోటీ పడతారు. అయితే తనకు ఎడ్యుకేషన్ తక్కవనే నెపంతో మేనేజర్ పోస్ట్ ఎక్కడ దక్కకుండా పోతుందో అనే భయంతో… ఇంటర్వూ జరిగే సమయానికి నాలుగు గంటల పాటు బంధించి వదిలేయమని ఓ కిరాయి రౌడీ దాస్ తో డీల్ కుదుర్చుకుంటాడు. దాంతో మేనేజర్ పోస్ట్ సాయిరాంని వరిస్తుంది. అయితే కిరాయిరౌడీ విశ్వనాథ్ ను మాత్రం వదిలేయడు. లక్షన్నర రూపాయలు ఇస్తేనే వదిలేస్తా అంటాడు. రౌడీ చేతిలో కిడ్నాప్ గురైన విశ్వనాథ్ ఎలా బటపడ్డాడు.. సాయిరాం అతనికోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. చివరకు విశ్వానాథ్ ఆచూకీ ఎవరు కనుగొన్నారనేదే మిగతా కథ.
మనమంతా… ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పెద్దమనిషి కథ. అతని చుట్టూ ప్రధానంగా సాగే కథా.. కథనం నడుస్తూనే… దాంతో పాటు కూతురు మహిత(రైనారావు) దయాగుణం… కుమారుడి లవ్ స్టోరీ.. భార్య గాయత్రి కుటుంబం కోసం పడే తపన… ఇలా నాలుగు స్టోరీలతో చాలా పకడ్బంధీగా కథనం సాగిపోతుంది. ప్రతి కథను మరో కథతో లింక్ చేయకుండా… క్లైమాక్స్ లో కలపడం చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమా మొదలైంది మొదలు…. నాలుగు స్టోరీలు ప్యార్ లల్ గా నడుస్తూ.. వేటికవే.. మధ్య తరగతి జీవితాలను స్పృషిస్తూ… ప్రతి వ్యక్తీ తన జీవితాన్ని ఆ పాత్రల్లో చూసుకునేలా కథనం సాగిపోతూ వుంటుంది.
చాలీ చాలని జీతంతో కుమారుణ్ని కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయించడానికీ… కూతురుని ప్రైవేటు స్కూల్లో చదివించడానికి ఓ మధ్య తరగతి కుటుంబ పెద్ద పడే కష్టాలు.. అవేవీ తెలియకుండా తమ పని తాము చేసుకునే పోయే పిల్లలు… ఇదంతా తెలిసిన ఇల్లాలు.. చాలా పొదుపుతో కుటుంభాన్ని నెట్టుకొచ్చే విధానం… ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ప్రతి సన్నివేశం మనసును హత్తుకుంటుంది. బాగా ఆధునికమై పోయిన ప్రస్తుత పరిస్తుతుల్లో ఓ సామన్య కుటుంబ పెద్ద… తనకు తెలియకుండానే ఓ సమస్యలో ఇరుక్కోవడం… దానిని సరిసేసుకోవడానికి అతను పడే బాధ… అలాగే తన కళ్లెదురుగా స్లమ్ కే పరిమితమయిపోతాడేమోనని ఓ నాలుగేళ్ల చిన్నారిని స్కూల్లో చేర్పించి… ఆ చిన్నారి కనిపించకపోయే సరికి ఆ బాలిక(రైనారావు) పడే మథనం.. ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.
చాలా కాలం తరువాత గౌతమి ఇందులో మధ్య తరగతి గృహిణిగా నటించారు. ఆమె నటన గురించి చెప్పాలంటే… చాలా సింపుల్. భర్త సంపాదనను ఆడంబరాలకు ఖర్చు చేయకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోయే ఓ సాధారణ గృహిణి పాత్రలో నటించి మెప్పించింది. చాలా మంది పాత తరం మహిళలు.. బాగా చదువుకున్నా… కుటుంబం కోసమే తమ జీవితాన్ని ఎలా అంకితం చేశారనే కోణంలో ఆమె పాత్రను దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించడం వల్ల.. ప్రతి మహిళ.. తమను తాము ఆ పాత్రలో చూసుకుంటారనడంలో సందేహం లేదు. ఈ చిత్రానకి నేపథ్య సంగీతం ప్రాధన ఆకర్ఫణ. పాటలు అంతాగా లేకపోయినా.. కేవలం నేపథ్య సంగీతమే భావోద్వేగాలను పలికించడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా వుంది. నిడివి 140 నిమిషాలే అయినా… సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగిపోతుంది. అయితే స్లో నెరేషన్ వల్ల సినిమా కొంత ల్యాగ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కొర్రపాటి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here