రివ్యూ: ఇద్దరం… ఓ సస్పెన్స్ థ్రిల్లర్

446

 

iddaram-movie-poster-9992

తారాగణం: సంజయ్, సాయి కృప, రంగనాథ్, సూర్య, జీవా తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.జె.సిద్ధార్థ్
ఎడిటర్: నాగేంద్ర కుమార్
సంగీతం: కిరణ్ శంకర్
కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: సుధాకర్ వినుకొండ
రేటింగ్: 2.75/5
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే.. ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా అలాంటి సినిమాలను తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా సుధాకర్ వినుకొండ అనే కొత్త డైరెక్టర్.. ‘ఇద్దరం’ అనే ఓ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తనే నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సస్పెన్స్ తో ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

స్టోరీ: గతం మరచిపోయి తాను ఎవరనేది తెలుసుకోవడానికి రోడ్ల మీద తిరుగుతుంటాడు హీరో సంజయ్. అసలే తానెవరో తెలియక అష్టకష్టాలు పడుతున్న సంజయ్ ను ప్రేమిస్తున్నానంటూ అందమైన హీరోయిన్ సాయి కృప వెంటపడుతూ వుంటుంది. అయితే వీరిద్దరి మధ్య గతంలో ఏదో జరిగిందనే సిగ్నల్స్ మాత్రం హీరోయిన్ ఇస్తూనే వుంటుంది. అయితే సంజయ్ మాత్రం దొరికిన క్లూలన్నింటినీ జల్లెడపడుతూ తానెవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. దొరికిన ఓ క్లూ ఆధారంగా తాతకు వరుసైన రంగనాథ్ ఇంటికి వెళ్లగా అక్కడ సాయి కృప ఫొటోకు దండ వేసి వుంటుంది. అంటే.. అప్పటి వరకు తనను వెంటాడిన సాయి కృప ఆత్మ అని తెలుసుకుని అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు? సంజయ్..సాయి కృపల మధ్య జరిగిన ఆ సంఘటన ఏంటనేదే ఈ చిత్రంలోని మెయిన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ కలిగించే ఎలిమెంట్. దాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ విశ్లేషణ: సామూహిక అత్యాచారం చేసే  వాళ్లలో కూడా ఓ మంచి వ్యక్తి ఉంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో సినిమా చేశానని దర్శకుడు ఆడియో ఫంక్షన్లో చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఎంచుకున్న కథ.. కథనం బాగానే వున్నా.. వాటిని తెరపై చూపించడంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకుని వుంటే బాగుండేది. అనాథ అయిన హీరో… అల్లారు ముద్దుగా పెరిగిన హీరోయిన్ ప్రేమలో పడి.. తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలకుంటున్న తరుణంలో.. కొన్ని అనుకోని కారణాల వల్ల హీరో చేతిలో హీరోయిన్ చనిపోవడం… ఆ తరువాత హీరో తన గతాన్ని మరచిపోయి తిరుగుతుంటే.. హీరోయిన్ అతని వెంట పడటం.. కట్ చేస్తే.. ఆమె ఎప్పుడో ముణ్ణెళ్ళ క్రితమే చనిపోయి కేవలం ఆత్మ మాత్రమే తన వెంట తిరుగుతోందనే నిజం హీరోకి ప్రీ క్లైమాక్స్ లో తెలియడం లాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ విషయాలు వున్నా… వాటిని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో మరికాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే ‘ఇద్దరం’ సినిమా నిజంగా ప్రేక్షకులను బాగా థ్రిల్ కు గురిచేసుండేది. కామెడీ సన్నివేశాలు లాంటివేమీ లేకుండా… సీరియస్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి సింగిల్ పాయింట్ తో తెరకెక్కిన చిత్రాలు మనకు ఆంగ్లంలో మాత్రమే కనిపిస్తాయి. దర్శకుడు అలాంటి ఫార్ములాను నమ్ముకునే.. కామెడీ.. గ్లామర్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడం బాగుంది.
హీరో సంజయ్.. ఇంతకు ముందు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘వెల్ కమ్ ఒబామా’ చిత్రంలో నటించాడు. అతనికిది రెండో సినిమా కావడంతో బాగానే నటించాడు. అయితే కొన్ని భావోద్వేగాలు పలికించడంలో ఇబ్బంది పడ్డాడు. ఉదాహరణకు… తన ప్రియురాలు తన చేతిలోనే మరణించిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు.. అతనిలో ఎక్స్ ప్రెషన్స్ మరింత బాగా ఉండాల్సింది. హీరోయిన్ సాయి కృప తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ఈ చిత్రం దాదాపు మూడేళ్ల క్రితం నుంచి తెరకెక్కించడంతో.. అక్కడక్కడ కొన్ని సీన్లు మరీ ఓల్డ్ అనిపిస్తాయి. హీరోయిన్ తాతగా సీనియర్ నటుడు రంగనాథ్ నటించారు. ఆయన నటించిన చివరి సినిమా ఇది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. పర్వాలేదు అనిపించాడు. సైకాలజీ వైద్యునిగా నటుడు సూర్య.. పోలీస్ ఆఫీసర్ గా జీవా నటన పర్వాలేదు. గ్యాంగ్ రేపులకు పాల్పడే వ్యక్తులుగా ఏమంత పరిచయం లేని ముగ్గురు యువకులు నటించారు. వీరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకుడు సుధాకర్ మంచి కథనే ఎన్నుకున్నాడు. తనే స్వయంగా నిర్మించాడు కాబట్టి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో పూర్తి స్వేచ్ఛ తనకుంది. అయినా ఎందుకో… ప్రేక్షకులను మెప్పించే ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎలాంటి హంగు… ఆర్భాటాలకు వెళ్లకుండా వైజాగ్, మచిలీపట్నం, బీదర్ తదితర చోట్ల చిత్రీకరించాడు. సినిమాటో గ్రఫీ బాగుంది. సినిమా నిడివి తక్కవగానే వుండటంతో.. ప్రేక్షకులు కూడా కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది. సంగీతం ఈ చిత్రానికి ఏమాత్రం ఉపయోగం పడదు. నేపథ్య సంగీతం పర్వాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here