రివ్యూవర్స్ ని దృష్టిలో పెట్టుకునే ‘ఈడు గోల్డ్ ఎహే’ తీశా: వీరు పోట్ల

60

veerupotla-eedugoldeheసునీల్, రిచాపన్ జంటగా న‌టించిన చిత్రం `ఈడు గోల్డ్ ఎహే`. ఈ చిత్రానికి వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుద‌ల కానుంది. అనీల్ సుంకర నిర్మాత. ఈ సంద‌ర్భంగా గురువారం వీరుపోట్ల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అవి మీకోసం…
1. మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యి చాలారోలైనట్టుంది… ఎలావున్నారుసార్?
జ: అవునండి దూసుకెళ్తా వ‌చ్చి చానాళ్ల‌యింది. అప్పట్లో మీడియా ముందుకొచ్చా. తరువాత ఇప్పుడు వచ్చా. ఇన్నాళ్లు ఈ సినిమా ప‌నిలో బిజీలో ఉన్నా. ఫైనల్ ఔట్ పుట్ వచ్చి రిలీజ్ అవుతోంది. చాలా హ్యాపీగా వున్నా.
2 సినిమా ఫైనల్ కాపీ చూశారా? ఎలా వ‌చ్చింది?
జ: చాలా బాగా వ‌చ్చింది. నా సినిమాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సునీల్ చిత్రాల్లోనూ ఉంటుంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అన‌గానే వినోదాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాబ‌ట్టి వినోదాత్మ‌కంగా వ‌చ్చింది.
3. ‘ఈడు గోల్డ్ ఎహే’ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
జ: మా చిత్రానికి ఈడు గోల్డ్ ఎహే అని పెట్టాం. అలా ఎందుకున్నామ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. రెగ్యుల‌ర్ ఫార్మేట్‌ను మార్చి సినిమాలు తీయ‌మ‌ని రివ్యూలు రాసేవారు చాలా వ‌ర‌కు చెబుతూనే ఉన్నారు. వాట‌న్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ క‌థ‌ను సిద్ధం చేసుకున్నా.
4 ఈ చిత్రానికి ఏదైనా స్ఫూర్తి ఉందా?
జ: నేను ఏ సినిమాను చూసినా స్ఫూర్తి పొందుతాను. నాకు తెలియ‌కుండానే నా చిత్రాల్లో అది క‌నిపిస్తుంది. అలాగే నేను ఏ సినిమా చేసిన‌ప్ప‌టికీ అది నా సినిమా అనే ఫీలింగ్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుడికి ఉంటుంది.
5. పోస్ట‌ర్‌లో మాస్క్ ఎందుకుంది?
జ: అది సినిమాలో చూడాలండీ.
6. టైటిల్‌లో లాఫింగ్ బుద్ధాను ఎందుకు పెట్టారు?
జ: లాఫింగ్ బుద్ధాకు సినిమాకు కాస్త క‌నెక్ష‌న్ ఉంటుంది. వినోదం + ఉత్కంఠ క‌ల‌గ‌లిపి తీసిన చిత్ర‌మిది. ఊహించ‌ని మ‌లుపు కూడా ఉంటుంది. ఎక్క‌డా ఎమోష‌న్‌ని మిస్ కాకుండా తీశాం.
7. దూసుకెళ్తా త‌ర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న‌ట్టున్నారు?
జ: ఆ సినిమా త‌ర్వాత ఓ మ‌ల్టీ స్టార‌ర్ అనుకున్నా. అయితే అది క్లిక్‌కాలేదు. ఆ త‌ర్వాత ఇంకో హీరోతో సినిమా చేద్దామ‌నుకున్నా. అయితే ఆయ‌న ఫ‌క్తు నా మార్కు చిత్రాన్ని ఆశించారు. అయితే నాకు అది న‌చ్చ‌లేదు. అందుకే ఈ సినిమా చేశా.
8. మీ త‌ర్వాతి చిత్రాలేంటి?
జ: ఇంకా ఏవీక‌మిట్ కాలేదు. కాక‌పోతే పీరియాడిక్ చిత్రాలు చేయాల‌ని ఉంది. అలాగే పోస్ట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాల‌ని ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here