రిజర్వేషన్లు పై ముద్రగడ స్పందన

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత  ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన కాపు జేఏసి సమావేశం.. అనంతరం మీడియాతో మాట్లాడిన ముద్రగడ …కాపు రిజర్వేషన్లు కు పూర్తి చట్టబద్దత కల్పించే వరకూ తమ పోరాటం ఆగదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపుల జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతం లేదని, రిజర్వేషన్లు శాతం పెంచాలని డిమాండ్ చేశారు.ఒక అడుగు ముందుకేసి కాపు రిజర్వేషన్లు పై అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టి అమోదించిన ముఖ్యమంత్రి చఁద్రబాబు కు ముద్రగడ అభినందనలు తెలిపారు. ఉద్యోగ,విద్య లలోతక్షణం రిజర్వేషన్లు అమల్లోకి తేవాలన్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని,

కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని పోరాడమని చెప్పారు. కాపు ఉద్యమం లో గాయపడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ, పోరాట ఫలితమే రిజర్వేషన్లు సాధించామన్నారు.  భోజనం బదులు టిఫిన్ పెట్టినట్టు గా రిజర్వేషన్ల శాతం వుందని ముద్రగడ అన్నారు. జనాభా ను తక్కువ చూపి తక్కువ శాతం రిజర్వేషన్లు  కేటాయించడం సరికాదన్నారు.
రిజర్వేషన్లు శాతం పెఁచాలని డిమాండ్ చేశారు.9వ షెడ్యూల్ లో చేర్చే బాధ్యత చంద్రబాబు దేనని, చంద్రబాబు గారిని ఇచ్చిన హామీలను అమలు చేయమంటే — నా వెనుక జగన్ వున్నారని చేసిన ఆరోపణలతో పదే పదే తనను అవమానాలకు గురిచేశారన్నారు. వెంటనే ఆ ఆరోపణాలు ఉపసంహరించుకోవాలని-ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపు ఉద్యమం చేస్తున్నందుకు నన్ను బాధపట్టే ప్రయత్నాలు బాబు చేశారు….నాకు ఇందులో పేరు అక్కర్లేదు. పదిశాతం పైనే రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
చంద్రబాబు మా జాతికోసం ఒక అడుగు ముందుకు వేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అయితే
పండగ 9వ షెడ్యూల్ లో చేర్చినపుడేనని ముద్రగడ అన్నారు. రాజకీయ రిజర్వేషన్లు పై సమాధానమిస్తూ…బి.సి. స్టేటస్ లో వున్న వారికి వర్తించే రిజర్వేషన్లు మాకు వర్తిస్తాయని భావిస్తున్నానని…ముద్రగడ అన్నారు. ఇతర బిసీ కులాలు ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కల్గించకుండానే మాకు ఫలాలివ్వాలని ముద్రగడ కోరారు.
చంద్రబాబు అడుగు ముందుకేసినందున 2018 మార్చి వరకూ ఉద్యమం వాయిదా  వేస్తున్నామని, ఈలోగా
9వ షెడ్యూల్లో చేర్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై వుందన్నారు. అంబేద్కర్ వర్థంతి రోజున ఆ కార్యక్రమాల్లో కాపులంతా పాలుపంచుకోవాలి ముద్రగడ పిలుపునిచ్చారు. కాపు కార్పొరేషన్ కు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలన్నారు. మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ , ఏసుదాసు ,నల్లా విష్ణు, శ్రీమతి ఉమామహేశ్వరి, ఆరేటి ప్రకాష్ ,తోట రాజేష్, కలవకొలను తాతాజీ,నల్లా పవన్, మెండుగుదుటి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *