రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు – జగన్‌ 

14

రాష్ట్రాన్ని విడగొట్టిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేబినెట్‌లో ఆమోదించి, ప్లానింగ్‌ కమిషన్‌కు పంపింది. 2 మార్చి 2014న ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ఏడు నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌ అమల్లో ఉంది.ఫైల్‌ ప్లానింగ్‌ కమిషన్‌ వద్దే ఉన్నా.. దాన్ని పట్టించుకోలేదు. ప్లానింగ్‌ కమిషన్‌కు ఒక్కసారి అయినా చంద్రబాబు లేఖ రాశారా? ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అర్థరాత్రి ప్రకటించిన ప్యాకేజీకి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ధన్యవాదాలు తెలిపారు.దిల్లీ వెళ్లి జైట్లీకి శాలువా కప్పి సత్కారం చేశారు. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు.ఇప్పుడేమో మళ్లీ ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదా కావాలంటున్నారు.రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు’’ అని జగన్‌ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here