రాష్ట్రంలో 296మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం;మంత్రి సోమిరెడ్డి

92

నెల్లూరులోని ఆర్&బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురవడంతో పాటు వరదలు సంభవించగా ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది..

రాష్ట్రంలో ఇప్పటికే 275 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం..నిన్న ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మరో 21 మండలాలను కలిపి మొత్తం 296 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం..

కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా అందజేసేందుకు 83, 378 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం..

తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండి పులిచెంతలకు కూడా ఇన్ ఫ్లో మొదలుకావడం ఆనందదాయకం..

అన్ని ప్రాజెక్టుల కింద సాగుకు నీళ్లు అందజేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం..

కృష్ణా జలాలు సోమశిలకు ఇప్పటివరకు 13 టీఎంసీలు వచ్చాయి..నీటిమట్టం 22 టీఎంసీలకు చేరింది..మరో పాతిక టీఎంసీలు తీసుకొస్తాం..

ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం..

2018లో 8 జిల్లాల్లో భారీవర్షాల కారణంగా పంట నష్టం జరిగితే రూ.141.35 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం..

2017-18లో రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా నష్టపోయిన ఐదు జిల్లాలకు రూ.147.63 కోట్లు విడుదల చేశాం..

2014 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.3,883.47 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీకి గాను 3,525 కోట్లు విడుదల చేశాం..

గత ప్రభుత్వాలు రైతుల కష్టనష్టాల్ని పట్టించుకోలేదు..

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరులోనూ కేంద్రం కంటే ఏపీలో ముందున్నాం..

రాష్ట్రంలో 11 శాతం వర్షపాతం తక్కువగా ఉంది..

కరువు జిల్లాల్లో 49 శాతం లోటు వర్షపాతం ఉంది..

2017-18లో పంటల బీమాలో 399.36 కోట్లు రైతులకు సెటిల్ చేశాం..

2016-17లో రూ.819.20 కోట్లు పంటల బీమా చెల్లించాం..

ఖరీఫ్ 2017 నిమిత్తం రూ.490 కోట్లకు గాను రూ.417 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలు విడుదల చేశాయి..

రెయిన్ గన్లు, స్పింక్లర్ల ద్వారా 18,708 హెక్టార్లలో పంటలు కాపాడాం..

ఈ రోజు జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ గ్రోత్ రేటు ముందుంది..తెలంగాణ కంటే కూడా ముందున్నాం..

జాతీయ స్థాయిలో జీవీఏ కంట్రిబ్యూషన్ 14.8 శాతం ఉంటే రాష్ట్రంలో 29.8 శాతం ఉంది..

సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ చేయడంతో పాటు రైతులకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా పంపిణీ చేయడంలో దేశంలోనే ముందున్నాం.

ఏపీఎంఐపీలోనూ గుజరాత్ ను వెనక్కు నెట్టి దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాం..

రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఏపీఎంఐపీలో కేంద్రం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాం..

42 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాం..కోటి ఎకరాల్లో సాగుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం..ప్రకృతి వ్యవసాయంలో ఏపీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది..

ప్రపంచానికి సందేశం ఇవ్వమని యూఎన్ఈపీ సీఎం చంద్రబాబు గారిని ఆహ్వానించింది..

నాలుగు, ఐదు విడతల రుణమాఫీకి సంబంధించి మొత్తం రూ.7,500 కోట్లను 10 శాతం వడ్డీతో ఈ ఏడాది డిసెంబరులోగా ఒకే సారి రైతుల ఖాతాలోకి జమ చేసేలా చర్యలు చేపట్టాం.

రుణమాఫీకి సంబంధించి 9 లక్షల ఫిర్యాదులు వస్తే 7.60 లక్షల ఫిర్యాదులు పరిష్కరించి రూ.660 కోట్లు మాఫీ చేశాం..వ్యవసాయంతో పాటు రైతులను ఆదుకోవడంలోనూ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాం..

ఈ రోజుటికి 30.72 లక్షల హెక్టార్లలో వేయాల్సివుంటే 29.37 లక్షల హెక్టార్లలో పంట వేశారు..

96 శాతం భూమిలో పంటలు సాగులో ఉండగా కేవలం నాలుగు శాతం మాత్రమే మిగిలివుంది.

రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉండి కూడా రూ.3,400 కోట్లు ఖర్చు పెట్టి పంటలు కొనుగోలు చేస్తే కేంద్రం 1100 కోట్లు మాత్రమే ఇచ్చింది..

ఏపీ విషయంలో కేంద్రం మొసలికన్నీరు కారుస్తోంది..ధాన్యం కొనుగోలులో అన్యాయం చేస్తోంది..

కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా రైతులను ఆదుకునే విషయంలో ముందున్నాం..

వ్యవసాయం అంటే తెలియని వాళ్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు..

రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం..

సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం రైతులు, ఆ తర్వాత నీటిపారుదల రంగం..

రాష్ట్రంలో ఏ రంగం చూసుకున్నా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్నో రెట్లు అభివృద్ధి చేశాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here