రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు, పోలీసు శాఖ‌లో సంస్క‌ర‌ణ‌ల‌పై హోం మంత్రి రివ్యూ

46

స‌చివాల‌యంలో లోని కాన్ఫ‌రెన్స్ హాల్ లో డిజిపి ఆర్పి ఠాకూర్ తో పాటు పోలీసు శాఖ లోని ముఖ్య అధికారుల‌తో హోంమంత్రి చిన‌రాజ‌ప్ప స‌మావేశం అయ్యారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై స‌మీక్ష జ‌రిపారు. పోలీసు శాఖ‌లోని వివిధ విభాగాల్లో ఉన్న స‌మ‌స్య‌లు వాటి ప‌రిష్కారంపై విభాగాల వారీగా లోతుగా చ‌ర్చ‌లు నిర్వహించారు. రానున్న రోజుల్లో శాఖ‌లో తీసుకునే సంస్క‌ర‌ణ‌ల‌పై అధికారుల‌తో డిప్యూటీ సిఎం రాజ‌ప్ప చ‌ర్చించారు. వివిధ జైళ్ల‌లో ఉన్న ప‌రిస్థితులు, అక్క‌డి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆదేశాలు ఇచ్చారు. రాయ‌ల సీమ లోని ప‌లు జైళ్ల‌లో ఖైదీలు ఆనారోగ్యం పాల‌వ్వ‌డంపై కార‌ణాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీల ఆరోగ్య ప‌రిర‌ష్క‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై త‌గు ఆదేశాలు జారీ చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంతో పాటు ప‌లు కీల‌క ప్రాంతాల‌లో భ‌ద్ర‌త వ్య‌వ‌హారాల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు.

మీడియాతో హో మంత్రి చిన‌రాజ‌ప్ప –

రాష్ట్రంలో ఇంకా హోంగార్డ్ ల అవ‌స‌రం ఉంద‌ని…కొత్త‌గా హోంగార్డుల‌ను నియ‌మిస్తామ‌ని చెప్పారు. డిజిపి ఎంపిక విష‌యంలో చ‌ట్ట ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని…తాజా గా వ‌చ్చిన సుప్రీం కోర్టు తీర్పు వ‌ల్ల ఎపి కి ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని రాజ‌ప్ప అన్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లులేవ‌ని….రాష్ట్ర ప‌తి పాల‌న పెట్టాల‌న్న బిజెపి నేత‌ల డిమాండ్ ను రాజ‌ప్ప కొట్టి పారేశారు. బిజెపి మ‌రో కుట్ర‌లో భాగంగానే ఇప్పుడు కొత్త‌గా మ‌రో అంశాన్ని తెర‌పైకి తెచ్చింద‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజ‌ప్ప వ్యాఖ్యానించారు. వైసిపి, జ‌నసేన ల‌ను ప‌క్క‌న పెట్టుకుని బిజెపి కుట్ర రాజ‌కీయ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని….ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోర‌ని రాజ‌ప్ప అన్నారు.

డిజిపి ఆర్పి ఠాకూర్-

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పటిష్టంగా ఉన్నాయ‌ని…ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని డిజిపి ఠాకూర్ అన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో క‌ఠినంగా ఉంటామ‌న్న ఆయ‌న‌..మ‌హిళ భ‌ద్ర‌త విష‌యంలో మ‌రింత కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు. కోస్ట‌ల్ ప్రాంతంలో సెక్యూరిటీ పైనా స‌మావేశంలో చ‌ర్చించామ‌ని డిజిపి తెలిపారు. స‌మీక్ష‌లో డిజిపితో పాటు నిఘా విభాగం అధిప‌తి ఎబి వెంక‌టేశ్వ‌రావు, హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అనురాద‌, శాంతి భ‌ద్ర‌త‌ల ఐజి హ‌రీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here