రాష్ట్రంలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి!

23

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం కర్నూలులో 36.3, విశాఖపట్నం, అనంతపురంలలో 35 డిగ్రీలు నమోదయ్యాయి. సముద్రం నుంచి గాలులు లేకపోవడంతో పగటి పూట ఎండలు పెరిగాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో రాత్రి చలి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా వుండడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here