రాయలసీమకు తీపి కబురు చెప్పిన రైల్వే జీఎం వినోద్

రాజధాని నుంచి రాయ‌ల‌సీమ‌కు రైళ్లు పెంచుతామని రైల్వే జీఎం వినోద్ అన్నారు. క‌డ‌ప‌ నుంచి రాజ‌ధానికి రైల్వే క‌నెక్టివిటీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ‌త మూడేళ్ళలో 9 కొత్త రైళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. 400 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయిలో తిరుప‌తి స్టేష‌న్‌ అభివృద్ది చేస్తామని, స్టేషన్‌లో మరో రెండు ప్లాట్‌ ఫామ్‌లు నిర్మిస్తామని అన్నారు. న‌డికుడి-శ్రీకాళహ‌స్తి లైన్ ప్రధాన అంశంగా తమ పరిధిలో ఉందని, కాకినాడ-పిఠాపురం లైన్‌ లాభదాయకం కానందునే ఆపేశామని అన్నారు. న‌వంబ‌ర్‌లో ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఇతర ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు వినోద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *