రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమా విశేషాలు..!

277
ram-charan-dhruva-for-magadheera-release-date_b_2303160508
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి ప‌రిస‌రాల్లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని నేచుర‌ల్ లోకేష‌న్స్‌లో మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేశారు.ఆరు గంట‌ల‌కు షూటింగ్ అంటే అంద‌రూ ఐదు గంటల‌కే లోకేష‌న్‌లో ఉండేవారు.  మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, హీరోయిన్ స‌మంత స‌హా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అంద‌రి స‌హ‌కారంతో మొద‌టి షెడ్యూల్‌ను అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేశాం. ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని న‌టించారు. అనుకున్న విధంగా సినిమా మంచి అవుట్‌పుట్‌తో రావ‌డం ఎంతో ఆనందంగాఉంద‌ని నిర్మాత‌లు తెలిపారు.
 మే 9 నుండి హైద‌రాబాద్‌తో పాటు రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. హైద‌రాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్ చేసిన త‌ర్వాత రాజ‌మండ్రిలో 45 నుండి 47 డిగ్రీల అమిత‌మైన ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా, మొద‌టి షెడ్యూల్‌లో స‌మంత‌కు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాజ‌మండ్రి షెడ్యూల్‌ను నిర్మాత‌లు పోస్ట్‌పోన్ చేశారు.
ఇప్పుడు చిత్ర‌యూనిట్ జూన్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోదావ‌రి న‌ది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేయ‌నున్నారు. అలాగే హైద‌రాబాద్‌లో సెట్స్ వేసి చిత్రీక‌రణ చేస్తారు. మెగాభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ అవుట్‌పుట్‌తో సినిమాను అందించ‌డానికి చిత్ర నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని, మోహ‌న్‌ చెరుకూరి  అందిస్తున్నారు. అలాగే ఆగ‌స్టులో సినిమా విడుద‌ల తేదిని కూడా ప్ర‌క‌టిస్తారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, ఆది త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో  న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here