రామ్ గోపాల్ వర్మ పెళ్లి పిలుపు

84

Sunny Wayne in Villain Malayalam Movie-Stills-Images-Photos-Onloనిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకం పై డి. వెంకటేష్ ఈ సంవత్సరం లో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు. దీనిలో భాగంగా ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ తో మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు…ఈ రెండు కాకుండా మరో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ స్క్రిప్ట్ పై కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ……..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్ సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు తీశారు . అడపాదడపా రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి…. లవ్ స్టోరీలు తీసినా వాటిల్లో ఒక వయలెంట్ బ్యాగ్రౌండో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఫాంటసీ బ్యాగ్రౌండో వుండేది , కానీ 365 days లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే” వర్మ గారు తన 25 ఏళ్ల కెరియర్ లో 100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటి సారి తీయటం ”
వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్ లవ్ & మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది…. చిత్రం చూసినవాళ్లు “365 days” చిత్రకథ ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days” ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే కాదు …..ప్రతి ఒక్కరి ప్రేమ కథ. & ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపు నివ్వబోతున్నారు. ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here