రాజధాని శంకుస్థాపనకి ఆహ్వాన పత్రిక విడుదల

arge-7ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పనులన్నీ శరవేగంగా సాగిపోతున్నాయి. విజయదశమి రోజున అమరావతి నగర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్రమోడీ పునాదిరాయి వెయ్యబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిరధమహారధులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆహ్వానపత్రికను కూడా అదే రేంజ్ లో రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రికను రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించాడు. అక్టోబర్ 22, 2015వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు శంకుస్థాపన ఉంటుంది. ఇన్విటేషన్ కార్డ్ లో ఒకవైపు సుముహూర్త వివరాలు, మరోవైపు అమరావతి స్తూపంపై ఉన్న బహుపత్ర తామరపుష్ప ముద్ర, ఇంకోవైపు నగర ప్రణాళిక ఉన్నాయి. అంతేకాదు, ఇన్విటేషన్ కార్డులో ఆహ్వానితులకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఉదయం 10.30 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని, భద్రతా కారణాల రీత్యా ఆహ్వానపత్రికను తమతో ఉంచుకోవాలని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని అందులో రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *