రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లు

రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పనిని నిర్ణిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గృహనిర్మాణం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలానికి పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించనని స్పఫ్టం చేశారు. సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు, సర్విస్ ప్రొవైడర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారం తీసుకుని 15 రోజులకు ఒకసారి డ్రోన్లతో తీసిన చిత్రాలను తనకు చూపించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారని అన్నారు. పనులకు సంబంధించిన యంత్రసామాగ్రి, మెటీరియల్ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ, అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *