రాజధానికి మరో 10 ఐటీ కంపెనీలు

45

ఒకే రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 10 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు.ఆగస్ట్ 1వ తేదీన తాడేపల్లి లోని ఇన్ఫోసైట్ భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఏపీ ఎన్ఆర్టి ఆధ్వర్యంలో ఈ 10 కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి.ఈ కంపెనీల ద్వారా సుమారుగా 1000 మంది యువతి,యువకులకు ఉద్యోగాలు రాబోతున్నాయి.తక్షణం 300 మంది స్థానిక యువతి,యువకులతో ఈ కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి

1)బిగ్ డేటా,ఐటీ సెక్యూరిటీ,ఈఆర్పీ,బిజినెస్ అనలిటిక్స్ అందిస్తున్న
వైబర్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ

2.మొబైల్ యాప్ తయారీ లో
హెడ్ రన్ టెక్నాలజీస్

3.ఇంజినీరింగ్ డిజైన్స్ అందిస్తున్న క్యాడిప్లాయ్

4.ఐటీ మరియు కన్సల్టింగ్ సేవలు అందిస్తున్న సిఎస్ఎస్ టెక్నాలజిస్

5.అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ తయారీ లో ఉన్న యలమంచిలి

6.అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో ఉన్న మెంటిస్

7.హెల్త్ కేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఉన్న నార్మ్ సాఫ్ట్ వేర్

8.ఓపెన్ ట్రక్ క్యాటరర్స్ సర్వీసెస్ అందిస్తున్న ఫ్రీమోన్ట్ ఐటీ సొల్యూషన్స్

9.కేపిఓ సర్వీసెస్ మరియు బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న
యాక్ర్స్ ఐటీ సర్వీసెస్

10.గ్రాఫిక్ డిజైన్,మొబైల్ అప్లికేషన్ సేవలు అందిస్తున్న ప్రోకామ్

రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న,మధ్య తరగతి కంపెనీ లు కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన డిటిపి పాలసీ చిన్న,మధ్య తరగతి కంపెనీలకు వరంగా మారింది.రెంటల్ సబ్సిడీ ఉండటం,ప్లగ్ అండ్ ప్లే మోడల్ లో ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ నెలలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కంపెనీలు, విశాఖపట్నం లో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here