రాంగోపాల్ వర్మ "ఎటాక్"

102

రాంగోపాల్ వర్మ … ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు . అత్యంత తక్కువ ఖర్చుతో జీరో సైజ్ లేదా లో బడ్జెట్ సినిమాలూ తీయగలరు . “అతివృష్టి అనావృష్టి” లాగ అన్నమాట!! ఇటీవలకాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశారు. “ఎటాక్” అనే వర్కింగ్ టైటిల్ తో… హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న తన తాజా చిత్రంలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం తెలుగు చలన చరిత్రలో ఇంతవరకూ ఎవరూ షూట్ చెయ్యని విధంగా.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పురానాపూల్ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను రెయిన్ ఎఫెక్ట్ లో తియ్యబోతున్నారు దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఫిబ్రవరి 27 ఉదయం నుంచి జరగబోతోంది. హైదరాబాద్ ధూల్ పేట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రంలోని కొంత మంది నటీనటుల లుక్స్ ని రిలీజ్ చెశారు రాంగోపాల్ వర్మ. సి.కళ్యాణ్ నిర్మాణంలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here