రాంగోపాల్‌ వర్మకు మరో షాక్‌ !

35

ప్రముఖ సినీదర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరో షాక్‌ తగిలింది. జీఎస్‌టీ చిత్రం ఉచ్చు ఆయన మెడకు బిగుసుకుంటోంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖా మంత్రి చినరాజప్ప ఆరా తీశారు. రాంగోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మహిళల్ని కించపరిచ్చే వ్యక్తులను ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టంచేశారు. మహిళల పట్ల వర్మ చేసిన వ్యాఖ్యల్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు విశాఖ పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాకినాడలో మహిళా సంఘాల ప్రతినిధులు హోంమంత్రిని కలిశారు.

వర్మ తీసిన జీఎస్‌టీ చిత్రం అసభ్యకరంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉందంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి దేవి హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి రాంగోపాల్‌ వర్మను హైదరాబాద్‌ పోలీసులు విచారించారు. తదుపరి విచారణ ఇంకా కొనసాగనున్న నేపథ్యంలోనే తాజాగా విశాఖలో ఆయనపై నమోదైన ఫిర్యాదుపై హోంశాఖ మంత్రి చినరాజప్ప చర్యలకు ఆదేశించడంతో వర్మకు మరిన్ని కష్టాలు తప్పవనే వాదనలు వినబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here