యువతలో నైపుణ్యం పెంచేందుకు పవన్‌

55

minister venkaiah naiduనెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ట్రస్ట్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. వెంకయ్య మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు సినీ రంగంలో పవన్‌ కల్యాణ్‌ యువకెరటమని వెంకయ్య ప్రశంసించారు. దేశానికి సేవచేయాలనే తపన పవన్‌లో చాలా ఉందని, అందుకే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చారని వెంకయ్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here